నేటి నుంచి చార్మినార్, గోల్కొండ సందర్శన బంద్.. కరోనా నేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖ కీలక ఆదేశాలు

నేటి నుంచి చార్మినార్, గోల్కొండ సందర్శన బంద్.. కరోనా నేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖ కీలక ఆదేశాలు
Golconda Fort And Charminar Visitors Closed

కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో చారిత్రక కట్టడాల సందర్శనను నిలిపివేస్తూ గురువారం కేంద్ర పురావస్తు శాఖ కీలక ఉత్తర్వులు జారీచేసింది.

Balaraju Goud

|

Apr 16, 2021 | 3:37 PM

Corona Pandemic:  దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో చారిత్రక కట్టడాల సందర్శనను నిలిపివేస్తూ గురువారం కేంద్ర పురావస్తు శాఖ కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఫలితంగా హైదరాబాద్‌లోని గోల్కొండ, చార్మినార్‌‌ సందర్శనను శుక్రవారం నుంచి నిలిపివేయనున్నారు. నేటి నుంచి మే 15వ తేదీ వరకు సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఆ తర్వాత కరోనా పరిస్థితిని బట్టి ఈ గడువు పెంచే అవకాశం కూడా ఉందని తెలిపారు. అయితే, హైదరాబాద్ మహానగర పరిధిలోని కుతుబ్‌షాహీ టూమ్స్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, ఇతర పర్యాటక ప్రాంతాల సందర్శన మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రులు, కోవిడ్ ఐసొలేషన్‌ కేంద్రాలు బాధితులతో నిండిపోతున్నాయి. కరోనాకు, ఇతర అనారోగ్య సమస్యలు తోడవుతుండడంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో 1,037 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 446, మేడ్చల్‌ జిల్లాలో 314, రంగారెడ్డి జిల్లాలో 277 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. గత మూడు రోజులుగా వరుస సెలవులు, పండగల కారణంగా పరీక్షలు తక్కువ చేయడంతో కేసులూ అంతేస్థాయిలో నమోదయ్యాయి. సెలవులు ముగియడంతో పెద్దసంఖ్యలో అనుమానితులు కరోనా పరీక్ష కేంద్రాలకు బారులు తీరడంతో కేసులు భారీగా నమోదవుతున్నాయి.

కాగా, పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుత సమయంలో విహార యాత్రలు, సరదా ట్రిప్పులు మానుకుంటే మంచిదంటున్నారు. మరోవైపు జనసమర్థక ప్రదేశాల్లో అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. కొన్ని వ్యాపార సంస్థలు రాత్రి సమయాల్లో స్వచ్చంధంగా మూసివేస్తున్నారు.

Read Also….

 Dubai Rover To Moon: అంతరిక్ష రంగంలో దూసుకెళ్లడానికి ప్రయత్నిస్తోన్న దుబాయ్.. త్వరలోనే చంద్రుడిపైకి రోవర్..

సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో బేబమ్మకు ఆఫర్ల వెల్లువ.. తమిళ స్టార్ హీరోకు జోడీగా కృతి శెట్టి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu