కరోనా దెబ్బకు గుళ్లు గోపురాలు, చారిత్రక కట్టడాలు, మ్యూజియంలు బంద్‌!

కరోనా వైరస్‌ మరోసారి విలయతాండవం చేస్తోంది. ఉప్పెనలా విరుచుకుపడుతున్న ఆ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. మళ్లీ జనజీవితాలను ఛిన్నాభిన్నం చేసేందుకు ఉద్యుక్తమవుతున్నది. కరోనాకు జడిసి చాలా ప్రభుత్వాలు పిల్లల పరీక్షలను రద్దు చేశాయి.

కరోనా దెబ్బకు గుళ్లు గోపురాలు, చారిత్రక కట్టడాలు, మ్యూజియంలు బంద్‌!
Closed Due To Covid Pandemic
Follow us
Balu

| Edited By: Anil kumar poka

Updated on: Apr 16, 2021 | 5:02 PM

కరోనా వైరస్‌ మరోసారి విలయతాండవం చేస్తోంది. ఉప్పెనలా విరుచుకుపడుతున్న ఆ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. మళ్లీ జనజీవితాలను ఛిన్నాభిన్నం చేసేందుకు ఉద్యుక్తమవుతున్నది. కరోనాకు జడిసి చాలా ప్రభుత్వాలు పిల్లల పరీక్షలను రద్దు చేశాయి. కొన్ని చోట్ల పాక్షిక లాక్‌డౌన్‌ అమలవుతున్నది. చాలా చోట్ల కఠిన ఆంక్షలు మొదలయ్యాయి. ఒక్కసారిగా జడలు విప్పుకున్న కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కాసింత ఆలస్యమైనా సరే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా చారిత్రక కట్టడాలతో పాటు మ్యూజియంలను కూడా మే 15 వరకు మూసి వేయాలని భారత పురావస్తు శాఖ తెలిపింది. తదుపతి ఆదేశాలు వచ్చేంత వరకు మూసివేసి ఉంచాలని పురావస్తు శాఖ డైరెక్టర్‌ ఎన్‌.కె.పాఠక్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంపై కూడా కరోనా ప్రభావం పడింది. కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాల మేరకు ఆలయాన్ని మూసి వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో శ్రీరామనవమి ఉత్సవాలపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు యాగంటి క్షేత్రంలో కూడా కరోనా కారణంగా భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నారు.

Temples Close

ఇక ఉత్తరాఖండలోని హరిద్వార్‌లో జరుగుతున్న పవిత్ర మహాకుంభమేళాపై కరోనా కన్నేసింది. ఇప్పటికే అక్కడ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కుంభమేళాలో పాల్గొన్న 30 మంది నాగ సాధువులకు కూడా కరోనా సోకింది. అఖిల భారత అఖాడా పరిషత్‌ నాయకుడు మహంత్‌ నరేంద్ర గిరి కరోనాతో ఇబ్బంది పడుతూ చికిత్స కోసం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చేరారు. ఆల్‌ ఇండియా అఖాడా పరిషత్‌ నాయకుడు మహంత్‌ నరేంద్ర గిరి కూడా కరోనాతో రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చేరారు. . నిరంజిని, జునా సహా దాదాపు అన్ని అఖాడాలోని సాధువులు వైరస్‌బారిన పడ్డారు. మహా నిర్వాణి అఖాడా అధినేత, ప్రముఖ సాధువు స్వామి కపిల్‌దేవ్‌ను కరోనా బలితీసుకుంది. ఇటీవల కరోనా సోకడంతో ఆయన చికిత్స కోసం రిషికేశ్‌లో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆయనను డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. కరోనా రోజురోజుకు విస్తరిస్తుండటంతో నిరంజిని అఖాడా సాధువులు కుంభమేళాను వీడేందుకు సిద్ధమయ్యారు. కుంభమేళా ప్రాంతంలో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ కుంభమేళాను ఇంకా ముగించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Temples Close.2

మరిన్ని ఇక్కడ చదవండి: Corona Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మంత్రి.. అసలు ఏమన్నారంటే.!

A. R. Rahman: మ‌నిషి బాధ‌ల‌కు విరుగుడు సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్