Corona Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మంత్రి.. అసలు ఏమన్నారంటే.!

Corona Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్ ఉంటుందా.? ఉందా.? అనే అంశంపై తాజాగా వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు....

Corona Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మంత్రి.. అసలు ఏమన్నారంటే.!
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 16, 2021 | 6:25 PM

తెలంగాణలో లాక్‌డౌన్ ఉంటుందా.? ఉందా.? అనే అంశంపై తాజాగా వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో లాక్‌డౌన్, కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించే ఆస్కారం ఉండదని.. కరోనా నిబంధనలు పాటిస్తూ.. అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటికి రాకూడదని సూచించారు. తాజాగా హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఎక్కువ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. అలాగే 25 సంవత్సరాల పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు చేయమని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కోరామని.. దానికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. కరోనా సెకండ్ వేవ్ గతంలో కంటే వేగంగా విస్తరిస్తోందని.. ప్రజలు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటివి తప్పనిసరిగా చేయాలని సూచించారు.

Also Read: 

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్..

ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు.. ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్‌ వాయిదా..