Double Masking: కరోనా కట్టడికి ఒక్క మాస్క్ సరిపోదా..? కాటన్ మాస్కుకు తోడు సర్జికల్ మాస్కు కలవాల్సిందేనా..?

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వికృతరూపం ప్రదర్శిస్తోంది. రోజు రోజుకీ మాయదారి వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరగుతుంది.

Double Masking: కరోనా కట్టడికి ఒక్క మాస్క్ సరిపోదా..? కాటన్ మాస్కుకు తోడు సర్జికల్ మాస్కు కలవాల్సిందేనా..?
Follow us

|

Updated on: Apr 17, 2021 | 5:13 PM

Double Masking protect covid: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వికృతరూపం ప్రదర్శిస్తోంది. రోజు రోజుకీ మాయదారి వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరగుతుంది. అయితే, మాస్కులతో కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చన్న విషయం మనందరికీ తెలిసిందే..! మాస్క్‌లు ఎలా ధరించాలన్నదానిపై నిపుణుల అధ్యయనంలో అసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకటికి బదులు రెండు మాస్కులు ధరిస్తే మరింత ప్రభావశీలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వైరస్ కణాలను జల్లెడపట్టి దూరంగా ఉంచే సామర్థ్యం రెట్టింపవుతుందని తాజాగా అధ్యయనంలో వెల్లడైందన్నారు.

అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ నార్త్‌కెరోలినా హెల్త్ కేర్ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రెండు మాస్కులు ధరించడం కారణంగా వైరస్ కణాలు.. నోరు, ముక్కులోకి ప్రవేశించలేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వివరాలు జేఏఎమ్ఏ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ఇటీవలే ప్రచురితమయ్యాయి. ఒకటికి బదులు రెండు మాస్కులు ధరించడం శ్రేయస్కారం అని పేర్కొన్నారు.

అయితే, మాస్కుల్లోని పొరల సంఖ్య పెంచడం వల్ల మాత్రమే రక్షణ పెరగదని యూనివర్శిటీ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ముక్కు, నోరు చుట్టూ మాస్కు సరిగ్గా అమరేటట్టుగా చూడాలన్నారు. మాస్క్‌లో ఎటువంటి ఖాళీలు ఏర్పడకుడదని వారు సూచించారు. వివిధ రకాల పదార్థాలతో తయారైన మాస్కులను, వివిధ రకాలుగా పరీక్షించి వారు ఈ విషయాలను వెల్లడించారు. కాటన్ వస్త్రంతో చేసిన మాస్కును, సర్జికల్ మాస్కును కలిపి వినియోగిస్తే మంచి ప్రయోజనం ఉన్నట్టు కూడా ఈ అధ్యయనంలో తేలింది. రెండు మాస్కులు వదులుగా ధరిస్తే ఆశించిన ఫలితం ఉండదని, దీనికి బదులు ముఖానికి సరిగ్గా అమరే ఒక మాస్కు వల్లే ఎక్కువ ఫలితం ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

కాగా, ప్రపంచవ్యాప్తంగా సెకండ్ వేవ్ రూపంలో విస్తరిస్తున్న కరోనా రాకాసిని అంతం చేయాలంటే ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులతో తమకు రక్షణతో పాటు ఇతరులను కూడా కాపాడినవాళ్లమవుతాయని వైద్యులు సూచిస్తున్నారు.

Read Also…

Corona Vaccine: కరోనా టీకా రెండు డోసులూ తీసుకోవాల్సిందేనా..రెండో డోసు ఎందుకు తీసుకోవాలి? నిపుణులు ఏమంటున్నారు?

  Tirupati, Nagarjuna sagar By Election 2021 Live: సాగర్, తిరుపతిలో కొనసాగుతున్న ఉపఎన్నిక.. సాయంత్రం 7 వరకు పోలింగ్‌