Neerav Modi deportation: త్వరలో నీరవ్ మోదీ అప్పగింత.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యుకే.. డిపోర్టేషన్‌కు రంగం సిద్ధం

పంజాబ్ నేషనల్ బ్యాంకుని నిండా ముంచి ఇంగ్లాండ్‌కు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు రప్పించే ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. నీరవ్‌ను భారత్‌కు అప్పగించే..

Neerav Modi deportation: త్వరలో నీరవ్ మోదీ అప్పగింత.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యుకే.. డిపోర్టేషన్‌కు రంగం సిద్ధం
Neevar Modi Cbi
Follow us

|

Updated on: Apr 17, 2021 | 6:01 PM

Neerav Modi deportation to India soon: పంజాబ్ నేషనల్ బ్యాంకుని నిండా ముంచి ఇంగ్లాండ్‌కు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు రప్పించే ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. నీరవ్‌ను భారత్‌కు అప్పగించే ఫైలుపై బ్రిటన్ హోం మంత్రి ప్రీతిపటేల్ సంతకం చేయడంతో మరో కీలక అడుగు వేసినట్లయింది. త్వరలోనే నీరవ్ మోదీని భారత అధికారులకు అప్పగించే పరిస్థితి కనిపిస్తోంది. హోం మంత్రి ఆమోదంతో యుకే హోం శాఖ కార్యదర్శి తదుపరి చర్యలకు ఉపక్రమించినట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం, మనీలాండరింగ్‌ కేసులో నిందితుడుగా ఉన్న నీరవ్‌ మోదీ ఇంగ్లాండ్‌కు పారిపోయి లగ్జరీ లైఫ్ గడుపుతున్న విషయం తెలిసిందే. రూ. 14,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీని భారత్ రప్పించేందుకు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు కొన్నేళ్ళుగా శ్రమిస్తున్నారు. లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ను (ఎల్‌ఓయూ) నీరవ్ మోదీ దుర్వినియోగం చేశారన్నది పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు అధికారుల ప్రధాన అభియోగం. 2018 జనవరి 31న నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీతోపాటు ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. తమ ఖాతాదారులకు విదేశాల్లోని తమ బ్యాంకుశాఖల నుంచి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జారీ చేసే గ్యారంటీ పత్రాన్నే ఎల్‌ఓయూ అంటారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఇచ్చిన ఎల్‌ఓయూతో నీరవ్‌ మోదీ ముఠా వివిధ కంపెనీల పేరిట విదేశాల్లోని పీఎన్‌బీ బ్యాంక్‌ శాఖల నుంచి రూ.13,000 కోట్లకుపైగా రుణాలుగా తీసుకొన్నాడు. వాటిని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టాడు.

ఈ కుంభకోణంపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఈ కేసులో 2018 మే 14న నీరవ్‌ సహా మొత్తం 25 మంది నిందితులపై మొదటి చార్జిసీట్‌ కోర్టులో దాఖలు చేసింది. 2019 డిసెంబర్‌ 20న రెండో చార్జిషీట్‌ దాఖలు చేశారు సీబీఐ అధికారులు. బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును దుబాయ్, హాంకాంగ్‌లోని తమ డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ముత్యాల ఎగుమతి, దిగుమతుల పేరిట ఈ సొమ్మును అతి తెలివిగా దారి మళ్ళించాడు నీరవ్‌ మోదీ. దీనికి అతని టీమ్ పూర్తిగా సహకరించినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. అదే క్రమంలో 2018 జనవరి 1న నీరవ్ మోదీ ఇండియా నుంచి పారిపోయాడు. అతనిపై ట్రయల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018 జూన్‌లో ఇంటర్ పోల్ రెడ్ కార్నర్నోటీసు జారీ అయ్యింది. 2019 మార్చిలో యూకే పోలీసులు నీరవ్‌ మోదీని లండన్‌లో అరెస్టు చేశారు. అతన్ని తమకు అప్పగించాలంటూ భారత ప్రభుత్వం యుకేను అభ్యర్థించింది.

దాదాపు మూడేళ్ళ భారత యత్నాలు ఇప్పుడు ఫలితమిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎట్టకేలకు నీరవ్‌ను భార‌త్‌కు అప్ప‌గించేందుకు బ్రిట‌న్ ఆమోదం తెలిపింది. అయితే యుకె హైకోర్టు ముందు 28 రోజుల్లోగా చట్టబద్ధంగా సవాలు చేసే చివరి అవకాశం ఇంకా నీరవ్ మోదీకి వుంది. గతంలో బ్రిటన్ ప్రభుత్వం తనను అప్పగించే ఉత్తర్వులపై సంతకం చేసిన తర్వాత విజయ్ మాల్యా కోర్టును ఆశ్రయించగా.. ఇప్పటి దాకా అతన్ని ఇండియాకు రప్పించలేకపోయింది భారత ప్రభుత్వం. విజయ్ మాల్యా కోర్టును ఆశ్రయించింది 2019 ఫిబ్రవరిలో కాగా.. రెండేళ్ళు దాటినా ఫలితం లేకపోయింది. కాగా.. నీర‌వ్ మోదీకి ముంబైలోని ఆర్ధ‌ర్ రోడ్డు జైలులో బ్యార‌క్ నెంబ‌ర్ 12లో అన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని బ్రిటన్‌ కోర్టుకు ఇప్పటికే భార‌త్ హామీ ఇచ్చింది.

కోట్లాది రూపాయల బ్యాంకింగ్‌ కుంభకోణాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన విజయ్‌మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ లాంటి వారిపై నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అపఖ్యాతి మిగిలింది. అయితే వీరిని వీలైనంత త్వరగా భారత్‌కు రప్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల రాజ్యసభలో ప్రకటించారు. కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి బ్యాంకులను దాదాపు రూ.9000 కోట్ల మేర మోసం చేసాడు విజయ్ మాల్యా. ఆ తర్వాత ఎంచక్కా బ్రిటన్‌కు పారిపోయాడు. పిఎన్‌బీ కుంభకోణం కేసులో నీరవ్‌ మోదీతోపాటు అతని మేనమామ మెహుల్‌ చోక్సీ మరో కీలక నిందితుడు. వీరిలో నీరవ్ మోదీ బ్రిటన్‌కు పారిపోయి ఆశ్రయం పొందగా.. మెహుల్ చోక్సీ మాత్రం ఆంటిగ్వా అండ్‌ బార్బుడాలో ఉంటున్నట్లు సమాచారం. చోక్సీ పౌరసత్వాన్ని ఇటీవలే ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ప్రభుత్వం రద్దు చేసింది. కాగా నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన సుమారు 2,600 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

దేశంలో కొన్ని దశాబ్ధాలుగా ఆర్థిక అవకతవకలకు పాల్పడి.. నరేంద్ర మోదీ ప్రభుత్వం రాగానే దర్యాప్తు వేగవంతం అవడంతో మొత్తం 31 మంది విదేవాలకు పారిపోయారు. ఈ ఆర్థిక నేరాలన్ని 2000 సంవత్సరం నుంచి కొనసాగుతున్నాయి. దశాబ్ధాల తరబడి ఈ ఆర్థిక నేరాలను గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. 2014 తర్వాత ఇలాంటి ఆర్థిక నేరాలపై దర్యాప్తు వేగవంతమవడంతో పలువురు ఆర్థిక నేరగాళ్ళు విదేశాలకు చెక్కేశారు. ఇలా పారిపోయిన 31 ఆర్థిక నేరగాళ్ళు మొత్తమ్మీద దేశంలోని వివిధ బ్యాంకులకు 41 వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టారు. ఈ 31 మంది ఆర్థిక నేరగాళ్ళ జాబితాలో నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ లాంటి వారున్నారు.

బ్రిటన్‌లోనే ఎందుకు దాక్కుంటున్నారు…?

ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిలో అత్యధికులు యుకే (ఇంగ్లాండ్‌)కు పారిపోయారు. అందుకు కారణం.. నేరస్తుల అప్పగింతకు సంబంధించి బ్రిటన్‌ కోర్టుల్లో కేసులు నత్తనడకన విచారణ జరుపుకుంటాయి. తమ దేశంలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసిన వారికి లేదా తమ దేశ పౌరసత్వాన్ని కొన్న వారికి యుకే చట్టాలు రక్షణ కవచంగా వుంటాయి. అలాంటి వారిని విదేశాలకు అప్పగించాలంటే లెక్కలేనన్న నిబంధనలున్నాయి. అందుకే భారత దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి.. అలా అక్రమంగా సంపాదించిన మొత్తంతో యుకేలో ఆస్తులు కొని.. అక్కడ తలదాచుకుంటున్నారు కొందరు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ ప్రస్తుతం బ్రిటన్‌లోనే పెద్ద పెద్ద విల్లాలు కొనుగోలు చేసి.. అక్కడ లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం లండన్ నైరుతి ప్రాంతంలోని వాండ్స్ వర్త్ జైలులో నీరవ్ మోదీ వున్నాడు. నిజానికి భారత్, యుకేల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం 1992లోనే జరిగింది. అయితే ఇప్పటి దాకా కేవలం ఇద్దరు నేరస్థులను మాత్రమే ఆ దేశం భారత్‌కు అప్పగించింది. చాలా కేసులు ఇంకా పెండింగ్‌లోనే వున్నాయి. తాజాగా కోర్టు ఆదేశాలు.. యుకే హోం శాఖ మంత్రి ప్రీతిపటేల్ గ్రీన్ సిగ్నల్ నేపథ్యంలో నీరవ్ మోదీ త్వరలోనే భారత్‌కు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

ALSO READ: కేలండర్‌తోపాటు మారిన కరోనా.. మ్యూటెంట్ వెర్షన్ మహా డేంజర్.. ఏ రాష్ట్రంలో ఎలా?

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్