విముక్తి కోసం పోరాటం, పాక్ లోని సింధ్ లో ప్రో-ఫ్రీడమ్ ర్యాలీ, ప్రధాని మోదీ, ప్రపంచ నాయకుల కటౌట్లు, బ్యానర్లు.

పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో జరిగిన ప్రో-ఫ్రీడమ్ (స్వాతంత్య్ర అనుకూల) ర్యాలీలో ప్రధాని మోదీ, ఇతర ప్రపంచ నాయకుల కటౌట్లు, బ్యానర్లు..

  • Umakanth Rao
  • Publish Date - 11:47 am, Mon, 18 January 21
విముక్తి కోసం పోరాటం, పాక్ లోని సింధ్ లో ప్రో-ఫ్రీడమ్ ర్యాలీ, ప్రధాని మోదీ, ప్రపంచ నాయకుల కటౌట్లు, బ్యానర్లు.

పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో జరిగిన ప్రో-ఫ్రీడమ్ (స్వాతంత్య్ర అనుకూల) ర్యాలీలో ప్రధాని మోదీ, ఇతర ప్రపంచ నాయకుల కటౌట్లు, బ్యానర్లు, ప్లకార్డులు దర్శనమిచ్చాయి. పాకిస్తాన్ నుంచి తమకు విముక్తి కలిగించి స్వేచ్చను ప్రసాదించాలంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ విషయంలో మోదీ, ఇతర ప్రపంచ నేతలు జోక్యం చేసుకోవాలని వారు కోరారు.  సింధ్ లోని శాన్ నగరంలో ఈ ర్యాలీ ఆదివారం జరిగింది.

తమ రాష్ట్రం ఇండస్-వ్యాలీ నాగరికతకు, వేదిక్ రిలిజిన్ కి ప్రతీక అని, బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని 1947 లో పాక్ కు అప్పగించిందని ర్యాలీలో పాల్గొన్నవారు పేర్కొన్నారు. సింధీలకు ప్రత్యేక దేశం..సింధు దేశ్ ఇవ్వాలని నిరసనకారులు కోరుతున్నారు. 1967 లో జీఎం సయీద్, పీర్ అలీ మహమ్మద్ రషీద్ ఈ డిమాండును లేవనెత్తారు. పాకిస్థాన్  ప్రభుత్వం, సైన్యం కారణంగా సింధ్ వాసులు ఎన్నో వేధింపుల బారిన పడుతున్నారని ప్రొటెస్టర్స్ పేర్కొన్నారు. బెలూచిస్థాన్ ప్రజలు కూడా దాదాపు ఇదేవిధమైన ఆరోపణలు చేస్తున్నారు.  ఈ రాష్ట్రం నుంచి అనేకమంది మేధావులు, కళాకారులు, విద్యావేత్తలు పాక్ కు భయపడి ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఆయా దేశాల్లో శరణార్థులుగా ఉంటున్నారు.