Samsung: శాంసంగ్ కంపెనీ వైస్ చైర్మన్ లీ జే యాంగ్‌కు రెండున్నరేళ్ల జైలుశిక్ష…
టెక్ దిగ్గజ సంస్థ, దక్షణి కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ వైస్ చైర్మన్ లీ జే యాంగ్‌కు రెండున్నరేళ్ల జైలుశిక్ష ఖరారైంది. భారీ అవినీతి కేసులో...
టెక్ దిగ్గజ సంస్థ, దక్షణి కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ వైస్ చైర్మన్ లీ జే యాంగ్‌కు రెండున్నరేళ్ల జైలుశిక్ష ఖరారైంది. భారీ అవినీతి కేసులో ఆయనకు ఈ శిక్షను విధించారు. లంచాలు, నిధుల దుర్వినియోగం కేసుల్లో శాంసంగ్ మాజీ చీఫ్ లీ జే యాంగ్‌కు శిక్షను ఖరారు చేశారు. కాగా ప్రభుత్వ అనుమతుల కోసం భారీ స్థాయిలో శాంసంగ్ ముడుపులు ఇచ్చినట్లు కోర్టులో నిరూపితమైంది.
దేశ అధ్యక్షురాలుకు సైతం…
ఈ అవినీతి కేసు వల్లే రెండేళ్ల క్రితం ఆ దేశ అధ్యక్షురాలు పార్క్ గెన్ హై తన పదవి కోల్సోవాల్సి వచ్చింది. విస్తృత స్థాయిలో అధికారులకు లంచాలు ఇచ్చినట్లు లీపై ఆరోపణలు ఉన్నాయి. మాజీ దేశాధ్యక్షురాలు పార్క్ గెన్ అధికారాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు శాంసంగ్ చీఫ్ ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ, అక్రమాలకు పాల్పడిన తీరు దురదృష్టకరమని కోర్టు పేర్కొన్నది. ప్రభుత్వ అనుమతుల కోసం భారీ స్థాయిలో శాంసంగ్ ముడుపులు ఇచ్చినట్లు మాజీ అధ్యక్షురాలిపై ఆరోపణలు వచ్చాయి. అవినీతి కేసులో తొలుత సియోల్ కోర్టు లీకి అయిదేళ్ల శిక్ష విధించినా.. ఇప్పుడు ఆ శిక్షను కుదించారు.