Accident: నెదర్లాండ్స్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని రెండు ముక్కలైన బస్సు.. షాకింగ్ విజువల్స్..

నెదర్లాండ్స్‌ ఘోర ప్రమాదం జరిగింది. నూరడ్‌ బ్రాంబట్‌ పట్టణంలో రైల్వే క్రాసింగ్‌ దగ్గర ఆగిన బస్సును వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు రెండు ముక్కలయ్యింది.

Accident: నెదర్లాండ్స్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని రెండు ముక్కలైన బస్సు.. షాకింగ్ విజువల్స్..
Netherlands Train Hits Bus
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 18, 2022 | 6:50 PM

నెదర్లాండ్స్‌ ఘోర ప్రమాదం జరిగింది. నూరడ్‌ బ్రాంబట్‌ పట్టణంలో రైల్వే క్రాసింగ్‌ దగ్గర ఆగిన బస్సును వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు రెండు ముక్కలయ్యింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు ఇంజన్‌ చెడిపోవడంతో రైల్వే క్రాసింగ్‌ దగ్గర బస్సును ఆపేశాడు డ్రైవర్‌. మెకానిక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో అటు నుంచి రైలు వస్తుండగా.. రైల్వే క్రాసింగ్‌ దగ్గర నిలబడ్డ బస్సు డ్రైవర్‌ రైలును ఆపాలని పదేపదే సూచించాడు. అయితే ఆ రైలు ఆగలేదు. జరగాల్సిన డ్యామేజీ జరిగింది. వేగంగా దూసుకు వచ్చిన రైలు.. రైల్వే క్రాసింగ్ వద్ద నిలిచి ఉన్న బస్సును ఢీకొట్టింది. దాంతో బస్సు క్షణాల్లో తునాతునకలైంది. రెండుగా విడిపోయింది. అయితే, ఈ ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేరు. చుట్టుపక్కన ఎవరికీ గాయం కూడా అవలేదు. దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. రైలు కొంత దూరం వెళ్లాక నిలిచిపోగా.. దాని ముందరి భాగం స్వల్పంగా ధ్వంసమైంది. ఇక రెండుగా ముక్కలైన బస్సు భాగాలు, ఇతర శిథిలాలను రైల్ ట్రాక్ నుంచి తొలగించారు అక్కడి సిబ్బంది. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. కాగా, ఈ భీకర ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ, ఇతర కెమెరా ఫుటేజీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ప్రమాదం జరిగిన తీరు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..