Love Marriage: పెళ్లికాని ప్రసాదులకు గుడ్ న్యూస్.. ఆ గ్రామంలో అందమైన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు.. కండిషన్స్ అప్లై..

Love Marriage: పెళ్లికాని ప్రసాదులకు గుడ్ న్యూస్.. అందమైన అమ్మాయిల(Beatyful Women)ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆసక్తి ఉన్న అబ్బాయిలకు బంపర్ ఆఫర్.. అయితే  కొన్ని కండిషన్స్ అప్లై అంటున్నారు..

Love Marriage: పెళ్లికాని ప్రసాదులకు గుడ్ న్యూస్.. ఆ గ్రామంలో అందమైన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు.. కండిషన్స్ అప్లై..
Brazil Noiva Do Cordeiro Wo
Follow us
Surya Kala

|

Updated on: Mar 01, 2022 | 12:39 PM

Love Marriage: పెళ్లికాని ప్రసాదులకు గుడ్ న్యూస్.. అందమైన అమ్మాయిల(Beatyful Women)ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆసక్తి ఉన్న అబ్బాయిలకు బంపర్ ఆఫర్.. అయితే  కొన్ని కండిషన్స్ అప్లై అంటున్నారు అందమైన యువరాణులు.  అవును ఇది నిజమే.. తమను ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు.. తమ గ్రామంలో నివసించవచ్చ్చు.. అంటూ బ్రెజిల్‌(Brazil)లోని నోయివా డొ కోర్డెరో(Noiva do Cordeiro)కు సంబంధించిన ఓ ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మా గ్రామంలోని అమ్మాయిలకు పెళ్లి కొడుకులు కావలెను. మీ నైపుణ్యం, తెలివితేటలు ఉపయోగించి ఇక్కడి అమ్మాయిలను ప్రేమించి పెండ్లి చేసుకునే సదుపాయం కూడా కలదు. అయితే ప్రేమిస్తే మాత్రమే సరిపోదు.. ఇరుపక్షాలు ఒప్పుకొంటేనే వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత మా గ్రామంలో ఉండాలంటే మాత్రం అబ్బాయిలకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి’ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఆ గ్రామంలోని యువతులు..

మరి ప్రేమ పెళ్లి అంటూ బహిరంగంగా ప్రకటించారు.. కనుక ఈ గ్రామంలో అమ్మాయి మరీ స్వేఛ్చను కోరుకుంటున్నారేమో అనే సందేహం అక్కర్లేదు. ఈ గ్రామంలో అమ్మాయిలు మంచి పనిమంతులు.. బారెడు పొద్దెక్కేవరకు నిద్రపోయి.. బెడ్ కాఫీ తాగే బ్యాచ్ అస్సలు కాదు. కోడి కూయక ముందే నిద్ర లేచి పనులు చేస్తారు.అవసరం అయితే పలుగు, పార పట్టుకుని పొలం పనులకు సైతం వెళ్తారు. తమ పనులను తాము చేసుకుంటారు. కుటుంబానికి, బంధాలకు, బంధుత్వాలకు ఎనలేని మర్యాద, గౌరవం ఇస్తారు. ఇంత పని చేస్తారు మోటుగా ఉంటారేమో అని సందేహం కూడా అస్సలు వద్దు ఈ గ్రామంలోని అమ్మాయి అచ్చం దేవకన్యల మాదిరిగా ఉంటారు. అలాంటి అమ్మాయిలు తమకు సరైన జోడీ ఎక్కడా అని వెతుకుతున్నారు. ఇకపోతే, ఇలాంటి అమ్మాయలు పెళ్లి చేసుకోవడానికి ముచ్చటగా మూడు  షరత్తులున్నాయి. అవి ఏంటంటే..

ఈ మూడు షరతుల్లో ఏ ఒక్కటి అతిక్రమించినా మళ్లీ ఇంటిబాట పట్టాల్సిందే. ఇంతకీ ఆ కండిషన్లు ఏమిటంటే? ఒకటి.. వంట. రెండు.. అంట్లు తోమడం, బట్టలు ఉతకడం. మూడు.. టాయిలెట్‌ కడగడం. ‘ఓసోస్‌! అదెంత పని. అవన్నీ మాకు వచ్చు కదా’ అంటారేమో.. ఆ మూడింటినీ మీ ఒంట్లో సత్తువ ఉన్నంత కాలం చేయాలి. అక్కడి అమ్మాయిలు స్వతంత్రులు. ఏ పనిచేసినా ఆలూమగలు కలిసే చేయాలి. లింగ భేదం ఉండదు. ఏ బాధ్యతైనా సమానంగా పంచుకోవాల్సిందే. అమ్మాయి వంట చేస్తే, అబ్బాయి కూరగాయలు తరగాలి. అబ్బాయి వంట చేస్తే అమ్మాయిలు స్వచ్ఛందంగా కాయగూరలు తరుగుతారు. ఎన్ని బట్టలున్నా ఇద్దరూ కలిసే ఉతకాలి. టాయిలెట్‌ క్లీనింగ్‌ బాధ్యత మాత్రం అబ్బాయిలదే.

మరి ఆ ఊరి స్పెషాలిటీ ఏమిటంటే.. బ్రెజిల్‌కు చెందిన మారియా సెన్హోరిన్హా 1891లో ఓ వ్యక్తిని ప్రేమించింది. తాను ప్రేమించిన వ్యక్తిని బలవంతంగా పెళ్లి చేసుకుంది. దీంతో మరియా బంధువులు, గ్రామస్థులు ఆమెను బహిష్కరించారు. దీంతో అప్పుడు మరియా డొ కోర్డెరో గ్రామానికి వచ్చింది. అక్కడే స్థిరపడింది. అనంతరం పురుషాధిక్యత లేని సమాజాన్ని ఏర్పాటు చేసి.. సక్సెస్ అందుకుంది. ఈ గ్రామంలోని మహిళలు. తమకంటూ కొన్ని ఆచారాలు, పద్ధతులు, నిబంధనలు పెట్టుకున్నారు. వాటిని అతిక్రమించడానికి వీలు లేదు. మరి ఇవన్నీ ఒకే అయితే బ్రెజిల్‌లోని నోయివా డో కోర్డెరో గ్రామానికి వెళ్లి అబ్బాయిలు అక్కడి అమ్మాయిల మనసును గెలిచి మనువాడొచ్చు.

Also Read:

వివాదంలో భీమ్లానాయక్.. మా మనోభావాలు దెబ్బతిన్నాయి… ఆ సన్నివేశం తొలగించండని ఫిర్యాదు