Russia Ukraine Crisis: యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్‌ తొలిసారి ప్రెస్‌ మీట్‌.. ఏం చెప్పారంటే..

Vladimir Putin: ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తొలిసారి ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి రష్యా రాజధాని మాస్కోలో ఈ సమావేశం నిర్వహించారు.

Russia Ukraine Crisis: యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్‌ తొలిసారి ప్రెస్‌ మీట్‌.. ఏం చెప్పారంటే..
Vladimir Putin
Follow us
Basha Shek

|

Updated on: Feb 25, 2022 | 1:12 AM

Vladimir Putin: ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తొలిసారి ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి రష్యా రాజధాని మాస్కోలో ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో ఉక్రెయిన్‌ తోయుద్ధం కొనసాగింపుపై కీలక ప్రకటన చేశారు. ‘గ్లోబల్‌ ఎకానమీలో మేం కూడా భాగమే. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను పాడు చేయడానికి మేం ఎలాంటి ప్రణాళికలు చేపట్టడం లేదు. అది మా లక్ష్యం కానే కాదు. కేవలం రష్యాను రక్షించుకోవడానికే ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నాం. మా భాగస్వామ్య దేశాలు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. యుద్ధం కొనసాగింపు విషయంలో వెనక్కు తగ్గేది లేదు. ‘ అని పుతిన్‌ చెప్పుకొచ్చారు. మరోవైపు ఉక్రెయిన్ పై దాడిపై రష్యాలో ఆందోళనలు చెలరేగాయి. యుద్ధం తక్షణమే నిలిపేయాలని కోరుతూ ఆ దేశ ప్రజలు రోడ్డెక్కుతున్నారు.

మరోవైపు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా పుతిన్ తో ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలని కోరారు. అదేవిధంగా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో నెలకొన్న తాజా పరిణామాలు, భారతీయ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను పుతిన్ కు గుర్తు చేశారు మోడీ.

Also Read:IND vs SL: హిట్‌మ్యాన్ @ టీ20 ఫార్మాట్‌ నయా కింగ్.. మూడో స్థానంలో విరాట్.. ఆ రికార్డులు ఏంటంటే?

Viral Video: చిరుత వేట ఎలా ఉంటుందో చూసారా.. షాకింగ్‌ వీడియో మీకోసం

Viral Video: చిరుత వేట ఎలా ఉంటుందో చూసారా.. షాకింగ్‌ వీడియో మీకోసం