Russia Ukraine Crisis: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం.!!
ఉక్రెయిన్‌లో యుద్ద పరిస్థితుల నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష కొనసాగుతోంది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్...
ఉక్రెయిన్‌లో యుద్ద పరిస్థితుల నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష కొనసాగుతోంది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్‌నాద్ సింగ్, విదేశాంగ మంత్రి జయశంకర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తాజాగా పరిణామాలు, ముడి చమురు ధరలు తగ్గించే మార్గాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇవాళ రాత్రి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడే అవకాశం ఉందని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్ధులతో పాటు భారత పౌరులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఉక్రెయిన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న హంగేరీ ప్రాంతం ద్వారా భారతీయులను తరలించేందుకు ఎంబసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే వారు సరిహద్దు ప్రాంతమైన జోహెనైకు చేరుకొని.. అక్కడి అధికారులతో చర్చిస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా హంగేరీలోకి తీసుకొచ్చి.. అక్కడ నుంచి హంగేరీ ప్రభుత్వం సాయం ద్వారా ఇండియాకు తరలించాలని ఏర్పాట్లు చేస్తున్నారు.