Martial Law: రష్యా అధక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం.. విలీన భూభాగాల్లో మార్షల్ లా.. ఉక్రెయిన్ ఆగ్రహం..
పుతిన్ ప్రకటనతో.. ఉక్రెయిన్ లోని లుహాన్స్క్, దొనెత్స్క్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాల్లో సైనిక పాలన అమల్లోకి వచ్చింది. మార్షల్ లాతో ఈ ప్రాంతాల్లో సైన్యానికి అదనపు అధికారాలు దక్కనున్నాయి.

ఎనిమిది నెలలుగా ఉక్రెయిన్‌లో కొనసాగిస్తున్న యుద్ధం ఇప్పటి వరకూ స్పష్టమైన ఫలితాలను ఇవ్వకపోవడంతో.. రష్యా తోక తొక్కిన పాములా మరింత రెచ్చిపోయి బుసలు కొడుతోంది. ఇప్పటి వరకూ తమకు స్వాధీనమైన భూభాగాల్లో ఉక్రెయిన్ ఆర్మీ నుంచి ప్రతిఘటన ప్రారంభం కావడం మరింత ఇబ్బందుల్లో పడేసింది.. ఈ పరిస్థితుల్లో ఇటీవల రెఫరెండం జరిపి వినీనం చేసుకున్న నాలుగు ప్రాంతాల్లో మార్షల్‌లా విధిస్తున్నట్లు ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్.. బుధవారం జరిగిన రష్యా భద్రతా మండలి సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పుతిన్ ప్రకటనతో.. ఉక్రెయిన్ లోని లుహాన్స్క్, దొనెత్స్క్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాల్లో సైనిక పాలన అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయంతో ఈ ప్రాంతాల్లో సైన్యానికి అదనపు అధికారాలు దక్కనున్నాయి.
కాగా మార్షల్ లా ద్వారా అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయాన్ని పుతిన్ స్పష్టం చేయలేదు. రష్యా భద్రత, సురక్షితమైన భవిష్యత్తు, తమ ప్రజల రక్షణకు చాలా కష్టమైన పనులను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజాభిప్రాయంత తమకు అనుకూలంగా వచ్చిందనే సాకుతో రష్యా స్వాధీనం చేసుకున్న నాలుగు ప్రాంతాల్లో ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన కొనసాగుతూనే ఉంది.
తమ పట్టును నిలుపుకోవడం కష్టంగా ఉందని రష్యన్ సైనికాధికారుల తాజా నివేదికలు చెబుతున్నాయి. అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని వారు అంగీకరిస్తున్నారు. ఖేర్సన్‌లో ఉక్రెయిన్ దాడులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నాలుగు పట్టణాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది రష్యా.. ఇలా వారం రోజుల వ్యవధిలో 60వేల మందిని తరలించారు.




కొత్త నియమాలు ఈ ప్రాంతాలలో కదలికలపై పరిమితులు ఉండనున్నాయి. కాగా.. ఉక్రెయిన్‌లోని నాలుగు ఆక్రమిత ప్రాంతాలలో యుద్ధ చట్టాన్ని అమలు చేస్తూ రష్యా ప్రకటించడంపై ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉక్రేయిన్ వాసుల ఆస్తులను దోచుకోవడానే ‘మార్షల్ లా’ విధించారని.. ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్ పేర్కొన్నారు. కాగా.. ఈ ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..