Dog skipping: వెనుక కాళ్లపై నిలబడి స్కిప్పింగ్‌ చేసిన కుక్క…వరల్డ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది.. వీడియో వైరల్‌…

ఇప్పుడు స్కిప్పింగ్‌ ఆడుతున్న కుక్క కూడా ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించుకుంది. కుక్క స్కిప్పింగ్‌ ఆడుతున్న వీడియోని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్‌ చేయగా, అది కాస్త వైరల్‌ అవుతోంది.

Dog skipping: వెనుక కాళ్లపై నిలబడి స్కిప్పింగ్‌ చేసిన కుక్క...వరల్డ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది.. వీడియో వైరల్‌...
Dog Makes World Record
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 12, 2023 | 7:07 PM

సాధారణంగా కుక్కలకు మనుషులకు మంచి సంబంధం ఉంటుంది. పెంపుడు కుక్కలపై వాటి యజమానులు ఎనలేని ప్రేమను చూపిస్తుంటారు. అవి కూడా తమ యాజమాని విశ్వాసానికి కట్టుబడి ఉంటాయి. అంతేకాదు.. కుక్కలు తెలివైన జంతువులుగా పరిగణిస్తారు. అవి మనుషుల భావోద్వేగాలను అర్థం చేసుకుంటాయి. అంతేకాదు.. అవి అవసరాన్ని బట్టి వ్యూహాలను కూడా రచిస్తుంటాయి. బాధలో ఉన్న తమ వారి ముఖాల్లో చిరునవ్వు తెప్పించే విన్యాసాలు చేసే కుక్కల వీడియోలు ఇంటర్నెట్‌లో అనేకం చూస్తుంటాం..ప్రస్తుతం ఓ పెంపుడు కుక్క తన యజమానితో కలిసి స్కిప్పింగ్‌ ఆడుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. వివిధ వ్యక్తులు, జంతువులు ప్రపంచ రికార్డులను నెలకొల్పడం, రికార్డ్‌ బ్రేక్‌ చేయటం వంటి వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తరచుగా చూస్తుంటాం. ఇప్పుడు స్కిప్పింగ్‌ ఆడుతున్న కుక్క కూడా ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించుకుంది. కుక్క స్కిప్పింగ్‌ ఆడుతున్న వీడియోని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్‌ చేయగా, అది కాస్త వైరల్‌ అవుతోంది.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR) తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో బాలు అనే కుక్క ఒక వ్యక్తితో కలిసి స్కిప్పింగ్‌ ఆడుతున్న వీడియోను షేర్ చేసింది. కుక్క, దాని యజమాని కలిసి 30 సెకన్లలో అత్యధిక స్కిప్‌లు చేసి ప్రపంచ రికార్డును సృష్టించారు. వీడియోలో బాలు.. 30 సెకన్లలో వెనుక కాళ్ళపై నిలబడి స్కిప్పింగ్‌ ఆడింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వీడియోను షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

రికార్డ్‌ బుక్‌ ఆధారంగా…బాలు 30 సెకన్లలో వెనుక కాళ్లపై నిలబడి..అత్యధికంగా 32 స్కిప్ప్‌లు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు 3,000,000 కంటే ఎక్కువ వ్యూస్‌లు వచ్చాయి. 20,000 కంటే ఎక్కువ లైక్‌లు, అనేక ప్రశంసనీయమైన కామెంట్లు సంపాదించుకుంది.