AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithyananda: నిత్యానంద కైలాసానికి గుర్తింపు వచ్చిందోచ్.!.. ప్రత్యేక దేశంగా ఐడెంటిటీ ఇచ్చిన అమెరికా.. అంతే కాకుండా..

నిత్యానంద.. ఈ పేరు చెబితే చాలు.. భారత్‌ నుంచి చెక్కేసి ఎక్కడో దక్షిణ అమెరికా దీవుల్లో తిష్ఠ వేసిన స్వామీజీ మరోసారి వార్తల్లోకెక్కాడు. తన దేశానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే పనిలో ఉన్నాడు నిత్యానంద...

Nithyananda: నిత్యానంద కైలాసానికి గుర్తింపు వచ్చిందోచ్.!.. ప్రత్యేక దేశంగా ఐడెంటిటీ ఇచ్చిన అమెరికా.. అంతే కాకుండా..
Nithyananda
Ganesh Mudavath
|

Updated on: Jan 13, 2023 | 6:51 AM

Share

నిత్యానంద.. ఈ పేరు చెబితే చాలు.. భారత్‌ నుంచి చెక్కేసి ఎక్కడో దక్షిణ అమెరికా దీవుల్లో తిష్ఠ వేసిన స్వామీజీ మరోసారి వార్తల్లోకెక్కాడు. తన దేశానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే పనిలో ఉన్నాడు నిత్యానంద. నిత్య వివాదాల స్వామి నిత్యానంద కైలాస రాజ్యాన్ని ప్రకటించినప్పుడు ఎవరు నమ్మలేదు. కాని అమెరికాలోని ఓ రాష్ట్రం ఆ దేశాన్ని గుర్తించింది. అంతేకాదు నిత్యానంద కైలాసంతో నెవార్క్‌ సిటీ ద్వైపాక్షిక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇక తన దేశానికి అమెరికానే గుర్తింపు ఇచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు నిత్యానంద. న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్‌ సిటీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. న్యూజెర్సీ రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగిన సిటీగా నెవార్కకు పేరుంది. సిటీ కౌన్సిల్‌ నిత్యానంద కైలాసదేశంలో ఒప్పందం కుదుర్చుకోవడం సంచలనం రేపుతోంది.

అమెరికాలో ప్రతి రాష్ట్రానికో చట్టం అమల్లో ఉంటుంది. ఎవరికి వాళ్లు సొంతంగా ఒప్పందాలు కుదుర్చుకునే వీలుంటుంది. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద 50 సార్లు కోర్టుకు హాజరై, 2019 నవంబర్లో భారత్ వదిలి ప‌రార్ అయ్యారు. ప్రస్తుతం కైలాస అనేది నిత్యానంద ప్రపంచం. దానికి తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. కైలాసను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన చేసుకున్నారు. కొద్దిరోజులకు కైలాస డాల‌ర్ ను తీసుకొచ్చారు. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా ప్రారంభించినట్లు ప్రకటించారు.

ఈక్వెడార్ సమీపంలోని ఓ ద్వీపాన్ని నిత్యానంద కైలాసంగా మార్చి ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు నిత్యానంద కైలాసానికి అమెరికా స్థాయిలో గుర్తింపు వచ్చే సరికి.. ఎప్పటికైనా ఐక్యరాజ్యసమితి గుర్తింపును సైతం పొందుతామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు నిత్యానంద పరివారగణం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.