Viral Video: 10నెలల చిన్నారి గొంతులో చిక్కుకున్న పాన్‌కేక్.. లైఫ్ వాక్‌తో కాపాడిన ఓ వ్యక్తి వీడియో వైరల్

Viral Video: ఓ పదినెలల చిన్నారి పాన్ కేక్ తింటున్న సమయంలో .. అది గొంతులో అడ్డంపడంతో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడుతుంటే.. రెస్టారెంట్ లోనే ఉన్న..

Viral Video: 10నెలల చిన్నారి గొంతులో చిక్కుకున్న పాన్‌కేక్.. లైఫ్ వాక్‌తో కాపాడిన ఓ వ్యక్తి  వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Nov 22, 2021 | 2:47 PM

Viral Video: ఓ పదినెలల చిన్నారి పాన్ కేక్ తింటున్న సమయంలో .. అది గొంతులో అడ్డంపడంతో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడుతుంటే.. రెస్టారెంట్ లోనే ఉన్న ఓ వ్యక్తి స్పందించి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడాడు.  లైఫ్ వాక్ అనే పరికరాన్ని ఉపయోగించి చిన్నారి ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన అమెరికాలోని సౌత్ కరోలినాలోని ఓ రెస్టారెంట్‌లో చోటు చేసుకుంది. రెస్టారెంట్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ముమ్ జైన్ కోహ్లర్ తన  భర్త పది నెలల బాలుడితో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్ళింది, అక్కడ 10 నెలల చిన్నారి గాబ్రియేల్  కు పాన్ కేక్ పెట్టడంలో.. అది ఆ బాలుడు గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆ బాలుడు ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంటే.. వెంటనే తల్లి ఆ బాలుడు వీపుని తట్టడం మొదలు పెట్టింది. అది చూసిన  ముమ్ జైన్ కోహ్లర్ వెంటనే తాను కూడా ఆ చిన్నారికి ప్రధమ చికిత్స అందించడానికి ప్రయత్నించాడు. అప్పటికే బాబు నీలం రంగులోకి మారడం మొదలు పెట్టాడు. దీంతో  ముమ్ జైన్ కోహ్లర్ ఎవరైనా వెంటనే అంబులెన్స్ కి కాల్ చేయమని వేడుకుంది. తన బాబుని బతికించడానికి ఎవరైనా సహాయం చేయమంటూ తల్లి అర్ధించింది.

అది చూసి రెస్టారెంట్ లోని వారందరూ చిన్నారి దగ్గరకు చేరుకోగా.. రెస్టారెంట్ లో ఉన్న మేజర్ హిల్లార్డ్ అనే వ్యక్తి  వెంటనే బయకు పరిగెత్తి… లైఫ్ వాక్ (గాలి పీడనం కలిగించి శుబ్రపరిచే ఒక చిన్న వస్తువు) ని తీసుకుని వచ్చాడు. అనంతరం గాబ్రియేల్ దగ్గరకు వచ్చిన మేజర్ హిల్లార్డ్ ఆ లైఫ్ వాక్ ని నోటి దగ్గర పెట్టి.. ఊరిపీలుచుకోవడానికి అడ్డంగా ఉన్న పాన్ కేక్ ముక్కని బయటకు తీశాడు. అనంతరం ఆ చిన్నారి ఊపిరి పీల్చుకోవడం మొదలు పెట్టాడు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులతో పాటు.. మిగిలిన వ్యక్తులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదే విషయంపై హిల్లార్డ్ స్పందిస్తూ.. తన దగ్గర ఈ లైఫ్ వాక్ డివైజ్ దాదాపు తన కారులో ఐదేళ్ల నుంచి ఉందని.. ఇప్పటి వరకూ దీని అవసరం రాలేదని అన్నారు. అయితే ఇప్పుడు చిన్నారి ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడినందుకు తనకు సంతోషంగా ఉందని అన్నాడు. హిల్లార్డ్ సమయస్ఫూర్తి పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:

హైదరాబాద్‌ మీదుగా మాదకద్రవ్యాల రవాణా.. ఇంటర్నేషనల్‌ కొరియర్‌ ఏజెన్సీల ద్వారా విదేశాలకు..

శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుతమైన అవకాశం.. వర్షాల కారణంగా దర్శనం చేసుకోలేని వారి కోసం..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్