Students Exam: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష.. 9 గంటల పాటు రాయాల్సి ఉంటుంది.. ఎక్కడంటే..!
Students Exam: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన దక్షిణ కొరియా సునెంగ్ పరీక్ష మరోసారి వార్తల్లో నిలిచింది. నవంబర్ రెండవ వారంలో జరిగే ఈ పరీక్షకు..
Students Exam: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన దక్షిణ కొరియా సునెంగ్ పరీక్ష మరోసారి వార్తల్లో నిలిచింది. నవంబర్ రెండవ వారంలో జరిగే ఈ పరీక్షకు ప్రతి సంవత్సరం 5 లక్షల మంది విద్యార్థులు హాజరు అవుతారు. ఈ పరీక్ష 9 గంటల పాటు ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం వల్ల భవిష్యత్తుతకు తిరుగులేదనే చెప్పాలి.
సునెయుంగ్ పరీక్ష అంటే ఏమిటి:
ఈ పరీక్ష అత్యంత కష్టమైనది. 9 గంటల పాటు రాయాల్సి ఉంటుంది. దక్షిణ కొరియాలో ఈ పరీక్ష విశ్వవిద్యాలయ ప్రవేశం కోసం నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనేది ఉన్నత విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థి కల. చాలా కష్టమైన పరీక్ష కావడంతో తల్లిదండ్రులు దీనిపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పిల్లలు ఈ పరీక్షకు హాజరవుతున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పరీక్షల కష్టాల వల్ల పిల్లల్లో డిప్రెషన్ పెరిగిపోతోంది. పరీక్షల్లో మార్పులు చేయాల్సి ఉందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతి సంవత్సరం నవంబర్‌లో పరీక్షకు ముందు, సియోల్ సమీపంలోని జోగ్యేషా ఆలయం వద్ద తల్లిదండ్రుల రద్దీ ఉంటుంది. ఈ తల్లిదండ్రులు పరీక్షలు రాసే పిల్లల గురించి ప్రార్థిస్తుంటారు. పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఈ పరీక్ష అవసరమని, అయితే అవసరం కంటే ఎక్కువ కష్టపడటం పిల్లల మానసిక ఆరోగ్యానికి మంచిది కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు. చాలా మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ పరీక్ష కారణంగా ఇక్కడి యువతలో డిప్రెషన్ కేసులు పెరుగుతున్నాయి. ఇక అభివృద్ధి చెందిన దేశాల గురించి చెప్పాలంటే.. దక్షిణ కొరియా లో యువత అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఆత్మహత్య రేటు కూడా పెరిగిపోతోంది. ఇక్కడ గత ఐదేళ్లలో 24 ఏళ్లలోపు యువత ఆత్మహత్యల రేటు 10 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
పరీక్షల కోసం రైళ్లు, విమానాల షెడ్యూల్లో మార్పులు:
దక్షిణ కొరియాలో ఈ పరీక్ష కారణంగా అక్కడి రైళ్లు, విమానాల షెడ్యూల్‌లను సైతం మార్పు చేస్తుంటారు. దీని బట్టి అర్థమైపోతుంది ఈ పరీక్ష ఎలాంటిదనేది. పరీక్షల షెడ్యూల్ వెలువడగానే రైలు, విమానాల సమయాలు కూడా మారుతుంటాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మరియు స్టాక్ మార్కెట్ల ప్రారంభ వేళలు మారుతాయి. పరీక్షా కేంద్రాలకు చేరుకోలేని చిన్నారులను తీసుకెళ్లేందుకు పోలీసులు వాహనాలు సమకూర్చారు. ఈ పరీక్ష వల్ల విద్యార్థుల్లో ఒత్తిడి, నిస్పృహ కొల్పోవడం జరుగుతుందట. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని విజేతలుగా పేర్కొంటారని, పరీక్షలో ఫెయిల్ అయిన వారిని జీవితాంతం వ్యర్థంగా పరిగణిస్తారని తల్లిదండ్రులు అంటున్నారు. ఈ పరీక్షను మార్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి: