Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Camels: ఒంటెలు నీరు తాగకుండా ఎలా ఉండగలుగుతాయి.. వాటి కనురెప్పల ప్రత్యేకత ఏమిటి? .. ఎన్నో ఆసక్తికర విషయాలు?

Camels without water: ఎడారులు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఒంటెలు. ఏడారిలో నీళ్లు లేకుండా ఒంటేలు జీవించగలవు. అయితే నిజానికి చెప్పాలంటే నీరు లేకుండా రెండు..

Camels: ఒంటెలు నీరు తాగకుండా ఎలా ఉండగలుగుతాయి.. వాటి కనురెప్పల ప్రత్యేకత ఏమిటి? .. ఎన్నో ఆసక్తికర విషయాలు?
Follow us
Subhash Goud

|

Updated on: Nov 22, 2021 | 9:50 AM

Camels without water: ఎడారులు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఒంటెలు. ఏడారిలో నీళ్లు లేకుండా ఒంటేలు జీవించగలవు. అయితే నిజానికి చెప్పాలంటే నీరు లేకుండా రెండు వారాలకుపైగా జీవించగలవు. కానీ ఆహారం లేకుండా కనీసం ఐదారు నెలల వరకు జీవించగల్గుతాయని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే దీనికి ‘డెజర్ట్స్ షిప్స్’ అని అంటారు. పరిశోధకుల వివరాల ప్రకారం.. అలాగే ఒంటెలు అనగానే మనకు గుర్తుకు వచ్చేది మూపురం. ఒంటెలు తమ వీపుపై ఉండే మూపురాల్లో నీటిని నిల్వ చేసుకుంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు. వాటి మూపురాల్లో ఉండేది కొవ్వు పదార్థం ఉంటుంది. మండుటెండల్లో ఏ మాత్రం తడిలేని ఎడారుల్లో కూడా ఒంటెలు అలసట లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించగలవు.

నీరు తాగకుండా ఎలా ఉండగలుగుతాయి:

ఒంటెలు ఎడారుల్లో నీరు తాగకుండా రెండు మూడు వారాల వరకు ప్రయాణించగలవు. వాటి ముక్కుల్లో ఉండే సన్నని వెంట్రుకల సాయంతో అవి గాలిలో ఉండే తేమను గ్రహిస్తూ, శరీరం నుంచి చెమట రూపంలో కోల్పోయే నీటిని భర్తీ చేసుకుంటాయట. అలా ఒంటెలు తమ శరీర ఉష్ణోగ్రతను పది డిగ్రీల సెంట్రిగ్రేడు వరకు తగ్గించుకోగలవు. నీరు లభించినప్పుడు ఒంటెలు కేవలం కొన్ని నిమిషాల్లోనే దాదాపు 100 లీటర్లు తాగగలవు. ఒంటెల రక్తంలో ఎర్ర రక్తకణాలు గోళాకారంలో ఉండటం వల్ల ఎంత నీరు తాగినా ఆ నీరు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం లేదు. అందువల్ల వాటికి ఏ హానీ జరగదని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మూపురంలో ఉండే కొవ్వు పదార్థం వల్ల ఉపయోగమేంటి?

అయితే అరేబియన్‌ ఒంటెలకు ఒకటే మూపురం ఉంటుంది. కానీ ఆసియా ఒంటెలకు రెండు మూపురాలు ఉంటాయి. అవి మూపురంలో కొవ్వును దాచుకుంటాయి. శరీరంలో కొవ్వు అంతా మూపురంలోకి చేరి అక్కడ నిల్వ ఉంటుంది. దాని వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. అందుకే ఎడారు లాంటి వేడి ప్రదేశాల్లో అవి తిరిగినా, మంచి నీరు లేకున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవిస్తాయని చెబుతున్నారు పరిశోధకులు.

ఒంటె కనురెప్పల ప్రత్యేకత ఏమిటి?

ఒంటెల కనుగుడ్లకు, కను రెప్పలకు మధ్య ఒక సన్నని పొరలాంటిది ఉంటుంది. ఎడారుల్లో తిరిగినప్పుడు ఇసుక కళ్లలో పడకుండా ఈ పొరే కాపాడుతుంటుంది. వీటి నోటి లోపల భాగాలు ఎంత దృఢంగా ఉంటాయంటే ముళ్ల చెట్లను, కాయలను సైతం తిన్నా ఎలాంటి గాయాలు కావు. ఇసుక, దుమ్మ రేగిన సమయంలో నాసికారంధ్రాలను మూసుకోగలిగే శక్తి ఒంటెలకు ఉంది. ఆవుపాలలో కంటే ఒంటె పాలలో కొవ్వ, చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. అయితే ఇవి తాగడం వల్ల మంచిది కాదంటున్నారు పరిశోధకులు. ఇవి చాలా చిక్కగా ఉండటం వల్ల కడుపులో తిప్పడం, వాంతులు కావడం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఒంటెలకు చమట త్వరగా పట్టదు. ఒక వేళ చమట పట్టాలంటే ఉష్ణోగ్రత 41 డిగ్రీలు దాటాల్సిందే.

శత్రువులు దాడి చేసిన సమయంలో..

ఒంటెను వేటాడటం ఏ మృగానికైనా కష్టమంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే ఒంటె కాళ్లు చాలా బలంగా ఉంటాయి. అంతేకాకుండా ఏ జంతువైనా దాడి చేస్తే దానికుంటే నాలుగు కాళ్లతో బలంగా తన్నే శక్తి ఉంటుంది. అలాగే శత్రువులు దాడి చేసిన సమయంలో ఒంటెలు ముందుగా చేసే పని ఒకటుంటుంది. ఉమ్మడం. ఆకుపచ్చ రంగులో ఉండే చిక్కటి ద్రవాన్ని ఉమ్మడం చేస్తాయి. ఆ జిగురును వదిలించుకోవడం ఆ వాసనను భర్తించడం చాలా కష్టం.

అలాగే ఒంటెలు ఇసుక తుఫ్లాన సమయంలో స్పష్టంగా చూడగలుగుతాయి. ఎందుకంటే ఒంటెలకు ఉండే కనురెప్పలకు రెండు పొరలు ఉంటాయి. అవి కళ్లకు ఎలాంటి ప్రమాదం కలుగకుండా కాపాడుతాయి. అంతేకాకుండా ముక్కు రంధ్రాల నిర్మాణం కూడా అవసరాన్ని బట్టి మూసుకునేటట్లు ఉంటుంది. అందుకే వాటికి ఏ ఇబ్బందీ ఉండదు.

ఇవి కూడా చదవండి:

Climate Change: పక్షుల రెక్కలు పెరగడం.. తగ్గడంపై వాతావరణ మార్పుల ప్రభావం.. పరిశోధనలలో సంచలన విషయాలు

Octopus: అక్టోపస్‌ జీవి గురించి తెలుసా..? అన్ని ప్రత్యేకతలే.. దీనికి 9 మెదడులు.. 3 హృదయాలు.. ఇంకా మరెన్నో..!