Road Accident: జనాలపైకి దూసుకొచ్చిన కారు.. ఐదుగురు మృతి.. 40మందికిపైగా తీవ్ర గాయాలు..!
Road Accident: రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వాహనాలను నిర్లక్ష్యంగా నడపడం..
Road Accident: రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వాహనాలను నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో ఓ కారు జనాలపైకి దూసుకెళ్లడంతో చాలా మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందగా, 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో క్రిస్మస్ పరేడ్ నిర్వహిస్తున్న వారిపై ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో చాలా మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షుతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.
అయితే ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారు వేగంగా వచ్చి జనాలను ఢికొట్టడంతో జనం భయంతో కేకలు వేశారు. ఢీకొట్టిన కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి కారణమైన వ్యక్తిని గుర్తించామని అన్నారు.
Graphic video shows a speeding vehicle ram through participants of the Christmas parade in #Waukesha, Wisc. Few details confirmed at this point though the police said they have a person of interest they’re looking into. pic.twitter.com/zKEX1VoC2T
— Andy Ngô ?️? (@MrAndyNgo) November 22, 2021
ఇవి కూడా చదవండి: