Road Accident: ఆలయానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం.. మరో 8 మందికి..
Maharashtra Road Accident: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును కారు ఢి కొట్టిన సంఘటన నలుగురు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మందికి
Maharashtra Road Accident: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును కారు ఢి కొట్టిన సంఘటన నలుగురు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం ముంబై-అహ్మదాబాద్ హైవేపై బోయిసర్ అవందాని గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ముంబై-అహ్మదాబాద్ హైవేపై వెళ్తున్న కారు.. వెనుకనుంచి ట్రక్కును వేగంతో ఢికొట్టింది. ఈ ఘటనలో కారులో నలుగురు నలుగురు అక్కడికక్కడే మరిణించినట్లు పాల్ఘర్ పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మానేర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధితులంతా లోనావాలా సమీపంలోని ఎక్వీరా దేవత ఆలయాన్ని సందర్శించి పాల్ఘర్‌లోని దండికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి అధిక వేగమే కారణమని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు మానేర్ పోలీసులు వెల్లడించారు.
Also Read: