AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivekananda Reddy: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై భరత్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు.. అసలు సూత్రధారి పేరు వెల్లడి !

YS Vivekananda Reddy: ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రోజురోజుకు సంచనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సీబీఐ..

Vivekananda Reddy: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై భరత్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు.. అసలు సూత్రధారి పేరు వెల్లడి !
Subhash Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Nov 22, 2021 | 12:23 PM

Share

YS Vivekananda Reddy: ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రోజురోజుకు సంచనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సీబీఐ విచారణ వేగంగా కొనసాగుతోంది. విచారణ చేపట్టినకొద్ది రోజుకో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అసలైన నిందితులు బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది నిందితులను అదుపులోకి తీసుకోని తమదైన శైలిలో విచారిస్తోంది సీబీఐ. వివేకానందరెడ్డి 2019 మార్చి 14న అర్ధరాత్రి తన ఇంట్లో హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసు అనుమానితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులుగా ఉన్న పలువురు ఆయన హత్యపై కీలక విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన షేక్‌ దస్తగిరి ఈ ఏడాది ఆగస్టు 31న కడప జిల్లా పొద్దుటూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎదుట ఇచ్చిన వాగ్మూలం ప్రతులు సోషల్‌ మీడియాలో కనిపించాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లా పులివెందులలో గోర్ల భరత్ కుమార్ యాదవ్ వివేకానంద రెడ్డి హత్య పై మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్యకు ప్రత్యేక సూత్రధారుడు అల్లుడు నరరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని వెల్లడించారు. కేవలం ఆస్తి కోసమే వైఎస్ వివేకా హత్య జరిగిందని, సునీల్ యాదవ్ నేరుగా తనతోనే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించినట్టు భరత్ యాదవ్ పేర్కొన్నారు.

వైఎస్‌ వివేకానంద రెడ్డి సన్నిహితురాలు షమీంకు ఆస్తి వెళుతుందని ఉద్దేశంతోనే వివేకానంద రెడ్డి హత్య జరిగినట్లు ఆయన తెలిపారు. హత్యకు వెల్లడించక పోవడానికి గల కారణం కేవలం ప్రాణభయం మాత్రమేనని అని.. మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలపై తనకు తెలిసిన విషయాలను మీడియాతో ఇవాళ చెప్పాల్సి వచ్చిందన్నారు. అయితే హత్యకు గల కారణాలను మొట్టమొదటగా సీబీఐకి అందించిన వ్యక్తి నేనేనని గోర్ల భరత్ యాదవ్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

Huge Robbery: నమ్మి తాళమిస్తే నట్టేటా ముంచారు.. భార్య, భర్త కలిసి ఏంత పని చేశారంటే..

Ramagundam: అందరూ చూస్తుండగానే ప్రాణం తీసుకున్నాడు.. స్టేషన్‌లోనే రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య..