Pathankot: ఆర్మీ క్యాంప్‌పై గ్రనేడ్ దాడి.. పఠాన్‌కోట్ పరిసర ప్రాంతాల్లో అలెర్ట్..
Grenade blast at Pathankot: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉన్న ఆర్మీక్యాంప్ సమీపంలో పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఆర్మీక్యాంప్ సమీపంలోని త్రివేణి గేట్ వద్ద సోమవారం తెల్లవారుజామున
Grenade blast at Pathankot: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉన్న ఆర్మీక్యాంప్ సమీపంలో పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఆర్మీక్యాంప్ సమీపంలోని త్రివేణి గేట్ వద్ద సోమవారం తెల్లవారుజామున గ్రనేడ్ దాడి పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పేలిన గ్రనేడ్ భాగాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే.. ఆ ప్రాంతం గుండా వివాహా బరాత్ వెళుతున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు గ్రెనెడ్ విసిరారని పోలీసులు తెలిపారు. అనంతరం వెంటనే అన్ని చెక్ పోస్టులను అప్రమత్తం చేశారు. నిందితుల కోసం క్షణ్ణంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిందెవరనే అంశాన్ని సీసీటీవీ ఫుటేజ్ ను నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఈ పేలుడులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సురేంద్ర లాంబా తెలిపారు. ఉగ్రవాదులే ఈ పని చేసి ఉంటారని భద్రతా దళాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి.
Punjab | A grenade blast took place near Triveni Gate of an Army camp in Pathankot. Further investigation is underway. CCTVs footage will be probed: SSP Pathankot, Surendra Lamba pic.twitter.com/NsVSQxz0eF
— ANI (@ANI) November 22, 2021
కాగా.. ఈ ఏడాది జూన్‌లో జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. డ్రోన్‌తో ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌పై ఉగ్రమూకలు గ్రెనెడ్ తో దాడిచేశారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు గాయపడిన సంగతి తెలిసిందే.
Also Read: