Viral Video: అందాల పోటీలో షాకింగ్ ఘటన.. ‘నా భార్య అందగత్తె కాదా..?’ అంటూ స్టేజ్‌పై భర్త వీరంగం

బ్రెజిల్‌లో జరిగిన ఓ అందాల పోటీలో షాకింగ్ సంఘటన జరిగింది. తన భార్య అందాల పోటీలో రెండో స్థానంలో నిలివడంతో కోపోధ్రిక్తుడైన భర్త హల్‌చల్‌ చేశాడు. వేదికపైకి ఎక్కి విజేత కిరీటాన్ని లాక్కొని, నేలకేసి కొట్టాడు. బ్రెజిల్‌లో గత శనివారం (27) జరిగిన LGBTQ+ అందాల పోటీలో..

Viral Video: అందాల పోటీలో షాకింగ్ ఘటన.. 'నా భార్య అందగత్తె కాదా..?' అంటూ స్టేజ్‌పై భర్త వీరంగం
Brazil Beauty Contest
Follow us
Srilakshmi C

|

Updated on: May 31, 2023 | 9:24 AM

బ్రెజిల్‌లో జరిగిన ఓ అందాల పోటీలో షాకింగ్ సంఘటన జరిగింది. తన భార్య అందాల పోటీలో రెండో స్థానంలో నిలివడంతో కోపోధ్రిక్తుడైన భర్త హల్‌చల్‌ చేశాడు. వేదికపైకి ఎక్కి విజేత కిరీటాన్ని లాక్కొని, నేలకేసి కొట్టాడు. బ్రెజిల్‌లో గత శనివారం (27) జరిగిన LGBTQ+ అందాల పోటీలో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

మిస్ గే మాటో గ్రోస్సో 2023 పోటీలో నాథల్లీ బెకర్ (Nathally Becker), ఇమాన్యుయెల్లీ బెలిని (Emannuelly Belini) అనే ఇద్దరు యువతులు ఫైనలిస్టులుగా నిలిచారు. ఓ మహిళ కిరీటాన్ని పట్టుకుని స్టేజ్‌పై విజేతను ప్రకటిస్తుంది. మిస్‌ బెలిని విజేతగా ప్రకటించి ఆమె తలపై కిరీటాన్ని పెడుతుండగా.. రన్నరప్ కంటెస్టెంట్ భర్త ఒక్కసారిగా వైదికపైకి దూసుకొస్తాడు. అనంతరం నా భార్య అందంగా లేదా అంటూ కిరీటాన్ని లాక్కుని నేలకేసి విసిరికొట్టడం వీడియోలో చూడొచ్చు. ఈ అనూహ్య ఘటనకు అందరూ షాక్‌కు గురవుతారు. అనంతరం భార్య నాథల్లీ బెకర్‌ను చేయిపట్టుకుని లాక్కెళ్తూ.. గట్టిగా అరుస్తూ.. మరోసారి కిరీటాన్ని నేలకేసి కొట్టి ముక్కలు చేస్తాడు.

ఇవి కూడా చదవండి

వెంటనే ఈవెంట్‌ నిర్వాహకులు జోక్యం చేసుకుని సదరు వ్యక్తిని స్టేజ్‌ నుంచి కిందికి తీసుకెళ్తాడు. అతనితోపాటు అతని భార్యను కూడా తీసుకెళ్తాడు. ‘మిస్‌ నాథల్లీ బెకర్ రెండో స్థానంలో నిలవడం న్యాయబద్దమైనదిగా ఆమె భర్త భావించలేదు. అందుకే నష్టాన్ని కలిగించాడు. అతని చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం’ అంటూ పేజెంట్ కోఆర్డినేటర్ మలోన్ హేనిష్ ఓ ప్రకటనలో వెల్లడించాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.