Dubai Heavy Rain: ఎడారి దేశంలో వర్షాలు, వరదల బీభత్సం.. రోడ్డుపై పడవల్తో ప్రయాణం..
భారీ వర్షాలు, తుఫాను నేపథ్యంలో యుఏఈ జాతీయ వాతావరణ కేంద్రం అనేక ప్రాంతాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. దుబాయ్‌లో భారీ వర్షాలు, వరదలకు సంబంధించిన అనేక చిత్రాలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. చాలా మంది ప్రజలు నీటితో నిండిన రోడ్ల వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కూడా పంచుకున్నారు.
దుబాయ్‌లో అందంగా మెరుస్తూ కనిపించే వీధులు ప్రస్తుతం నీట మునిగాయి. రోడ్లపై నదులు ప్రవహిస్తున్నట్లు కనిపిస్తోంది. మోకాళ్లలోతు నీరు ప్రవహిస్తోంది. దుబాయ్‌లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో ఇదంతా జరిగింది. వాతావరణంలో మార్పు కారణంగా మెరుస్తున్న రోడ్లు, ఎత్తైన భవనాల నేలమాళిగలు నీట మునిగిపోయాయి. దుబాయ్ ప్రభుత్వం ప్రజలు బీచ్‌కి వెళ్లడంపై నిషేధించింది. కొన్ని చోట్ల భారీ వర్షం కురవడంతో రోడ్డుపై పార్క్ చేసిన కార్లు పూర్తిగా నీట మునిగాయి.
ప్రతికూల వాతావరణం కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలు, తుఫానుల కారణంగా యుఏఈ లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. విమానాల రాకపోకలు దెబ్బతిన్నాయి. దుబాయ్ పోలీసులు ప్రజలు ఇంటి నుంచి బయటకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అంటూ హెచ్చరిక జారీ చేశారు. వరదలున్న ప్రాంతాల్లో తగు జాగ్రత్తగా ఉండాలని.. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షాలు, తుఫాను నేపథ్యంలో యుఏఈ జాతీయ వాతావరణ కేంద్రం అనేక ప్రాంతాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. దుబాయ్‌లో భారీ వర్షాలు, వరదలకు సంబంధించిన అనేక చిత్రాలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. చాలా మంది ప్రజలు నీటితో నిండిన రోడ్ల వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కూడా పంచుకున్నారు. ఒక వీడియోలో నీటితో మునిగిపోయిన రహదారిపై ఒక వ్యక్తి చిన్న పడవను నడుపుతున్నాడు.
దుబాయ్, సౌదిలో వరదలు
Floods in Dubai and Saudia pic.twitter.com/RAVIGqbYGy
— Lucy Ambati (@AmbatiLucy) November 18, 2023
వాతావరణంలో మరిన్ని మార్పులు రావడంతో పాటు వరదలు బీభత్సం సృష్టిస్తూ ఉండడంతో వెంటనే దుబాయ్ పోలీసులు స్పందించారు. రహదారులను నియంత్రించారు. మరోవైపు దుబాయ్ మున్సిపాలిటీ కూడా యాక్టివ్‌గా రంగంలోకి దిగి రోడ్డుమీద ఉన్న నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ప్రయివేట్ సంస్థలు తమ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కోరింది.
Floods in Dubai and Saudia pic.twitter.com/RAVIGqbYGy
— Lucy Ambati (@AmbatiLucy) November 18, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..