AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Disease for Dogs: పెంపుడు కుక్కలకు వింతైన వ్యాధి.. పశువైద్యులకు కూడా అంతుచిక్కడం లేదు..

ప్రపంచ దేశాల్లో నలుమూలల ఏదో ఒక జీవికి వింత వ్యాధులు సోకుతూ ఉంటాయి. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో ఇలాంటి కొత్త వ్యాధి వ్యాప్తి చెందుతోంది. అయితే మనుషులకు కాకుండా కుక్కలకు ఈవ్యాధి సోకడం గమనార్హం. ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలకు శ్వాసకోశ పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓరెగాన్ రాష్ట్రంలో ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ 200 కేసులు నమోదైనట్లు వైద్య నిపుణులు వెల్లడించారు.

Disease for Dogs: పెంపుడు కుక్కలకు వింతైన వ్యాధి.. పశువైద్యులకు కూడా అంతుచిక్కడం లేదు..
Domestic Dogs Suffering From A Strange Respiratory Disease In America
Srikar T
|

Updated on: Nov 19, 2023 | 6:55 AM

Share

ప్రపంచ దేశాల్లో నలుమూలల ఏదో ఒక జీవికి వింత వ్యాధులు సోకుతూ ఉంటాయి. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో ఇలాంటి కొత్త వ్యాధి వ్యాప్తి చెందుతోంది. అయితే మనుషులకు కాకుండా కుక్కలకు ఈవ్యాధి సోకడం గమనార్హం. ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలకు శ్వాసకోశ పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓరెగాన్ రాష్ట్రంలో ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ 200 కేసులు నమోదైనట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ వ్యాధి కుక్కల్లోనే ఎందుకు సోకుతుంతో ఎవరూ గుర్తించలేక పోతున్నారు. కొలరాడో, న్యూ హ్యాంప్ షైర్ రాష్ట్రాల్లో కూడా శునకాలు ఈ రోగాల బారిన పడ్డట్లు తెలుస్తోంది. రోడ్ ఐలాండ్, మసాచుసెట్స్ తోపాటూ ఇతర రాష్ట్రాల నుంచి కుక్కల శాంపిల్స్ తీసి న్యూ హ్యాంప్ షైర్ యూనివర్సిటీకి పంపుతున్నట్లు పశువైద్యులు డేవిడ్ నీడిల్ తెలిపారు.

దాదాపు సంవత్సర కాలంగా ఈవ్యాధి తమ దృష్టికి వస్తోందని వివరించారు వైద్యులు. ఈ వ్యాధి తీవ్రత పెరిగితే కుక్కలు మరణించే అవకాశం ఉందంటున్నారు. అయితే పెంపుడు కుక్కల యాజమానులు దీనిపై కొంత అవగాహన ఉంచుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలను కొందరు పెంపుడు కుక్కల యాజమానులు డాక్టర్లకు తెలిపారు. దీర్ఘకాలంగా దగ్గు, జలుబు, తుమ్ములు, ముక్కు, కళ్ల నుంచి నీరు కారడం వంటి అనారోగ్య సమస్యలతోపాటూ బద్దకం ఉందన్నారు.

ఇప్పటి వరకూ ఇచ్చిన యాంటీ బయాటిక్స్ పనిచేయడం లేదని చెబుతున్నారు. ఇలాంటి వింత వ్యాధులకు గల కారణాలను సేకరించిన శాంపిల్స్ ద్వారా పరిశోధనలు జరుపుతున్నారు వైద్య నిపుణులు. కుక్కలకు తరచూ వేయించే వ్యాక్సీన్ల విషయంలో అశ్రద్ద చూపకూడదని, సకాలంలో వ్యాక్సీన్లు వేయించాలని సూచించారు. పెంపుడు శునకాల తీరును ఎప్పటికప్పుడు గమనించాలని ఏదైనా మార్పు తలెత్తితే వెంటనే వైద్యులకు చూపించాలంటున్నారు. వ్యాధి ప్రాధమిక దశలోనే గుర్తిస్తే ప్రత్యమ్నాయ ఏర్పాట్ల ద్వారా తీవ్రతరం కాకుండా కాపడవచ్చంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..