Viral News: 16 ఏళ్ల వయసులో 18 కోట్ల లాటరీ గెలుచుకున్న యువతి.. నేడు తినడానికి తిండి లేక అష్టకష్టాలు..

36 ఏళ్ల కెల్లీ కేవలం 16 ఏళ్ల వయసులో లాటరీ తగిలింది. ఆ తర్వాత ఆమె అదృష్టం దురదృష్టంగా మారింది.  నివేదిక ప్రకారం 2003 సంవత్సరంలో కెల్లీ మొదటిసారి లాటరీని గెలుచుకుంది. అప్పుడు కెల్లీ జీవితం పూర్తిగా మారిపోయింది. ఇంత చిన్న వయసులోనే ఆమె బ్యాంకు ఖాతాలో రూ.18 కోట్లు జమ అయ్యాయి. ఇంత చిన్న వయసులో ఆమెకు డబ్బును ఎలా నిర్వహించాలో అర్ధం కాలేదు.

Viral News: 16 ఏళ్ల వయసులో 18 కోట్ల లాటరీ గెలుచుకున్న యువతి.. నేడు తినడానికి తిండి లేక అష్టకష్టాలు..
Callie Rogers
Follow us
Surya Kala

|

Updated on: Nov 11, 2023 | 1:04 PM

ఎవరైనా లాటరీని గెలుపొందితే అదృష్టవంతుడిగా పరిగణిస్తాము. అయితే లాటరీ గెలిచిన ప్రతి వ్యక్తి అదృష్టవంతుడు అవ్వాలనే రూల్ లేదు. కొన్నిసార్లు అదృష్టం అలా ఇచ్చి ఇలా వెళ్ళిపోతుంది. తమకు అనుకోకుండా దక్కిన అదృష్టాన్ని చివర వరకూ నిలబెట్టుకోలేరు. అలాంటి అదృష్టాన్ని తెచ్చే వాటిలో లాటరీ ఒకటి. లాటరీని గెలుచుకున్న ఓ మహిళ అదృష్టం దురదృష్టంగా మారింది. ఆ విషయం ఆమె కలలో కూడా ఊహించి ఉండదు.

36 ఏళ్ల కెల్లీ కేవలం 16 ఏళ్ల వయసులో లాటరీ తగిలింది. ఆ తర్వాత ఆమె అదృష్టం దురదృష్టంగా మారింది.  నివేదిక ప్రకారం 2003 సంవత్సరంలో కెల్లీ మొదటిసారి లాటరీని గెలుచుకుంది. అప్పుడు కెల్లీ జీవితం పూర్తిగా మారిపోయింది. ఇంత చిన్న వయసులోనే ఆమె బ్యాంకు ఖాతాలో రూ.18 కోట్లు జమ అయ్యాయి. ఇంత చిన్న వయసులో ఆమెకు డబ్బును ఎలా నిర్వహించాలో అర్ధం కాలేదు. తనకు అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టాన్ని నిలబెట్టుకోలేదు.. డబ్బులను పెట్టుబడి పెట్టలేదు లేదా ఆ డబ్బుతో మంచి పని చేయలేదు. తనకు అనుకోకుండా వచ్చిన డబ్బును పార్టీల కోసమే వినియోగించింది.

అప్పులు పాలైన కెల్లీ

లాటరీ తగిలిన డబ్బులన్నీ ఖర్చు పెట్టింది.. అనంతరం అప్పు అడగి మరీ ఖర్చు పెట్టడం మొదలు పెట్టింది. దీంతో ఆమె అప్పులపాలై అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మీరు డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఆ డబ్బు కూడా మీకు ప్రాముఖ్యత ఇవ్వదు. అది మీ చేతుల్లోంచి ఇసుకలా జారిపోతుంది అనే సామెతను నిజం చేసింది ఈ కెల్లీ.

ఇవి కూడా చదవండి

కెల్లీ విషయంలో అలాంటిదే జరిగింది. అనంతరం డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఆమె విపరీతంగా డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టింది. అంతేకాదు తనను స్నేహితులు, బంధువులు ఉపయోగించుకున్నారని ఆమె మనస్సులో స్థిరపడింది. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా జీవించడం మొదలు పెట్టింది. 2021 నాటికి కెల్లీ పూర్తిగా దివాళా తీసింది. ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లి, కెల్లీ ఒక సంరక్షణ కేంద్రంలో పని చేస్తుంది. అంతేకాదు కెల్లీ కుమారుడికి సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. తన కొడుక్కి చికిత్స చేయించాలని కోరుకుంటుంది. అయితే ఇప్పుడు తన కుమారుడికి వైద్యం చేయించడానికి ఆమె వద్ద తగినంత డబ్బు లేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..