Andhra Pradesh: అక్కడ సామాన్య ప్రజలకు ఉచిత వైద్యం.. ఉదయం 8 గంటలకే వైద్యం మొదలు..
విజయవాడ మ్యూజియం రోడ్డులో కృష్ణ జిల్లా లారీ ఓనర్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు సహాయం చేయాలనే సదుద్దేశంతో సోమవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్యం, రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాధారణ ప్రజలకు ఎటువంటి అదనపు ధరలు లేకుండా స్పెషలిస్ట్ డాక్టర్లైనా గుండె, చెవి, ముక్కు,కళ్ళు, చర్మ వైద్య నిపుణులచే ప్రత్యేక ఉచిత వైద్యం అందిస్తున్నారు.
నేటి ప్రపంచంలో వైద్యం దొరకక ఎంతో మంది ప్రజలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా అనారోగ్యంతో ఇబ్బంది పడితే.. ఎటువంటి ఆసుపత్రిలో చూపించుకోవాలన్నా అధిక మొత్తంలో సొమ్ము ఖర్చు అవుతుంది. కనీసం ప్రైమరి సెంటర్లకు వెళ్ళాలన్న కనీసం 5 వందల రూపాయల వరకూ అయినా సొమ్ము ఖర్చు చేయాల్సిందే. అయితే కొందరు వ్యక్తులు కలిసి చేసే వైద్యానికి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందిస్తున్నారు.
విజయవాడ మ్యూజియం రోడ్డులో కృష్ణ జిల్లా లారీ ఓనర్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు సహాయం చేయాలనే సదుద్దేశంతో సోమవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్యం, రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాధారణ ప్రజలకు ఎటువంటి అదనపు ధరలు లేకుండా స్పెషలిస్ట్ డాక్టర్లైనా గుండె, చెవి, ముక్కు,కళ్ళు, చర్మ వైద్య నిపుణులచే ప్రత్యేక ఉచిత వైద్యం అందిస్తున్నారు.
ఈ ఉచిత పేదల వైద్యాశాలలో నిరంతరం పేదలకు, సామాన్యులకు ఉచిత వైద్యం అందిస్తూ ఉంటారు. వారంలోని ఏడు రోజులలో ఒక సారి లేదా రెండు సార్లు మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్యం అందిస్తుండగా.. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు గుండె, కళ్ళు, చర్మం , ENT డాక్టర్లు ఉచితంగా ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. ఈ ఉచిత వైద్యశాలని కృష్ణ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు 1988 సంవత్సరంలో స్థాపించారు.
నిరంతరం ఈ వైద్యాశాలలో మగవారికి, ఆడవారికి సంబంధించి ప్రత్యేక వైద్యులు సేవలు అందిస్తున్నారు. ఈ ఉచిత వైద్యశాలలో అన్ని రకలైన బ్లడ్ టెస్టులు కూడా చేస్తారు. అతి తక్కువ ఖర్చుకే మందులను ప్రజలకు అందిస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..