YS Jagan: గతానికి, ఇప్పటికీ మధ్య తేడాలు గమనించండి.. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం జగన్

మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. గతానికి, ఇప్పటికీ మధ్య తేడాలు గమనించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్ కు దక్కుతుందని తెలిపారు. మైనారిటీస్‌ వెల్ఫేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు

YS Jagan: గతానికి, ఇప్పటికీ మధ్య తేడాలు గమనించండి.. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం జగన్
Ys Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 11, 2023 | 11:49 AM

మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. గతానికి, ఇప్పటికీ మధ్య తేడాలు గమనించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్ కు దక్కుతుందని తెలిపారు. మైనారిటీస్‌ వెల్ఫేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మైనార్టీల అభ్యున్నతి కోసం అనేక మార్పులు తీసుకోచ్చామని పేర్కొన్నారు. తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, శాసనమండి డిప్యూటీ చైర్మన్‌గా మహిళకు అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మైనార్టీలను పట్టించుకోలేదని.. 2019 నుంచి మైనార్టీల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని.. డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ప్రభుత్వం గౌరవిస్తోందంటూ వివరించారు.

ముస్లింలలో పేదలందరికి వైఎస్సార్‌ రిజర్వేషన్‌లు అమలు చేశారని.. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామని.. మైనార్టీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఇంత సంక్షేమం జరగలేదన్నారు. అన్ని రంగాల్లో మైనారిటీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. సాధికారతను మాటల్లో కాదు.. చేతల్లో చేసి చూపించామని తెలిపారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను గుర్తుచేసుకున్న సీఎం జగన్.. ఆయన జయంతిని మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.

రాష్ట్రంలో లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన కొనసాగిస్తున్నామని.. భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన బలం అంటూ వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందని.. అన్ని వర్గాల అభ్యున్నతే తమ లక్ష్యమని సీఎం జగన్ మరోసారి పునరుద్ఘాటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!