జమ్మూకశ్మీర్ లేకుండా భారత్ మ్యాప్‌ను ఎలా చూపిస్తారు..? బీబీసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రిటిష్ లేబర్ పార్టీ ఎంపీ

జమ్మూకశ్మీర్ లేకుండా భారత్ మ్యాప్‌ను చూపిస్తూ బీబీసీ ఛానల్ వార్తలు ప్రసారం చేయడంపై బ్రిటిష్ లేబర్ పార్టీ ఎంపీ, ఇండో - బ్రిటన్ ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ చైర్మన్ వీరేంద్ర శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జమ్మూకశ్మీర్ లేకుండా భారత్ మ్యాప్‌ను ఎలా చూపిస్తారు..? బీబీసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రిటిష్ లేబర్ పార్టీ ఎంపీ
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 19, 2021 | 8:03 AM

జమ్మూకశ్మీర్ లేకుండా భారత్ మ్యాప్‌ను చూపిస్తూ బీబీసీ ఛానల్ వార్తలు ప్రసారం చేయడంపై బ్రిటిష్ లేబర్ పార్టీ ఎంపీ, ఇండో – బ్రిటన్ ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ చైర్మన్ వీరేంద్ర శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంపూర్ణ భారత్ మ్యాప్‌ను ఎలా ప్రసారం చేస్తారంటూ బీబీసీ ఛానల్ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు.

బీబీసీ వ్యవహారశైలి పట్ల తాను ఎంతో బాధపడ్డానని, భారత్‌‌తో పాటు యూకేలో నివసించే కోట్లాది మంది భారతీయులను అవమానించారని శర్మ లేఖలో పేర్కొన్నారు. వెంటనే తప్పు సరిదిద్దుకొని, సరైన హద్దులతో, జమ్మూ కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగంగా చూపిస్తూ తిరిగి కథనం ప్రసారం చేయాలని వీరేంద్ర శర్మ డిమాండ్ చేశారు. ఇలాంటి భారత వ్యతిరేక ప్రసారాలు చేసి, బీబీసీ తమకు ఉన్న ప్రజాదరణ కోల్పోవద్దని హెచ్చరించారు. మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా సంపాదక సభ్యులకు ఆదేశాలు జారీ చేయాలని బీబీసీ డైరెక్టర్ జనరల్‌ను వీరేంద్ర శర్మ కోరారు.

Also Read:

ఆ కల్లులో ప్రమాదకరమైన రసాయనాలు.. అందుకే మరణాలు.. ల్యాబ్ రిపోర్ట్‌లోని వివరాలు ఇవే

SI Suicide: గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య.. వివాహేతర సంబంధమే కారణమా..!