Donald Trump: వైట్‌ హౌజ్‌ను వీడడానికి సిద్ధమవుతోన్న డొనాల్డ్‌ ట్రంప్‌… పదవి దిగగానే ఎక్కడికి వెళ్లనున్నాడంటే..

Trump Leave White House: ఎన్నో రాజకీయ పరిణామాల నడుమ డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పదవిని వీడేందుకు సిద్ధమయ్యారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న విషం తెలిసిందే...

Donald Trump: వైట్‌ హౌజ్‌ను వీడడానికి సిద్ధమవుతోన్న డొనాల్డ్‌ ట్రంప్‌... పదవి దిగగానే ఎక్కడికి వెళ్లనున్నాడంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 19, 2021 | 12:54 PM

Trump Leave White House: ఎన్నో రాజకీయ పరిణామాల నడుమ డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పదవిని వీడేందుకు సిద్ధమయ్యారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న విషం తెలిసిందే. ఇక అంతకు ముందు తన ఓటమిని ఒప్పుకోవడానికి నిరాకరించిన ట్రంప్‌ ఎంత రచ్చ చేయాలో అంత చేశారు. అయితే చివరికి తన ఓటమిని అంగీకరించిన ట్రంప్‌ వైట్‌ హౌజ్‌ను వీడనున్నారు. ఇదిలా ఉంటే బుధవారం జో డైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయక ముందే ట్రంప్‌ వైట్‌ హౌజ్‌ నుంచి నిష్క్రమించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కు వాషింగ్ట‌న్ న‌గ‌ర శివారుల్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వ‌ద్ద ట్రంప్ వీడ్కోలు కార్య‌క్ర‌మం జరగనుంది. అక్క‌డ నుంచి ‌ఫోర్స్ వ‌న్ విమానంలో డొనాల్డ్ ట్రంప్.. ఫ్లోరిడాకు బ‌య‌లుదేరి వెళ్ల‌నున్నారు. అధ్యక్షపదవిని వీడిన తర్వాత ట్రంప్‌ ఫ్లోరిడాలోని తన గోల్ఫ్‌ క్లబ్‌కు వెళ్లనున్నాడని సమాచారం. ఇక బుధ‌వారం 7.15 గంట‌ల‌క‌ల్లా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని ఆహ్వానాలు పంపించారు. ఇదిలా ఉంటే బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి తాను హాజరు కావట్లేదని ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా చరిత్రలో అధికార మార్పిడికి దూరంగా ఉంటున్న అతికొద్ది మందిలో డొనాల్డ్‌ ట్రంప్‌ ఒకరిగా నిలనున్నారు.

Also Read: War in Darfur : రక్తసిక్తంగా సూడాన్.. రెండు తెగల మధ్య ఘర్షణ.. అంతకంతకూ పెరుగుతున్న మృతులసంఖ్య..