AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Canada Row: భారత్, కెనడాల మధ్య వివాదం.. అమెరికా మద్దతు ఎవరికి.. ?

భారత్‌, కెనడా దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఇబ్బందులు చర్చనీయాంశమయ్యాయి. ఇరుదేశాల మధ్య జరుగుతున్న వ్యవహారాన్ని ఇప్పుడు ప్రపంచదేశాలు నిశితంగా పరిశీలన చేస్తున్నాయి. అలాగే అంతర్జాతీయ వేదికలపై కీలక పాత్ర పోషిస్తూ ప్రపంచ ఆర్థిక వృద్ధికి బలమైన సహాకారాన్ని అందిస్తున్న భారత్‌ ఓవైపు ఉండగా.. సంపన్న దేశాల కూటమి జీ7లో ఉన్న కెనడా మరోవైపు ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్న తరుణంలో ఆయా దేశాలు ఆచితూచిగా వ్యవహరిస్తున్నాయి.

India Canada Row: భారత్, కెనడాల మధ్య వివాదం.. అమెరికా మద్దతు ఎవరికి.. ?
Modi, Biden, Trudeau
Aravind B
|

Updated on: Sep 24, 2023 | 3:40 PM

Share

భారత్‌, కెనడా దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఇబ్బందులు చర్చనీయాంశమయ్యాయి. ఇరుదేశాల మధ్య జరుగుతున్న వ్యవహారాన్ని ఇప్పుడు ప్రపంచదేశాలు నిశితంగా పరిశీలన చేస్తున్నాయి. అలాగే అంతర్జాతీయ వేదికలపై కీలక పాత్ర పోషిస్తూ ప్రపంచ ఆర్థిక వృద్ధికి బలమైన సహాకారాన్ని అందిస్తున్న భారత్‌ ఓవైపు ఉండగా.. సంపన్న దేశాల కూటమి జీ7లో ఉన్న కెనడా మరోవైపు ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్న తరుణంలో ఆయా దేశాలు ఆచితూచిగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా మొగ్గుపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇప్పటిదాకా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఎన్నికల సమయంలో నిధులు సమకూర్చినటువంటి చార్లెస్‌ మైయర్స్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈయన సిగ్నం గ్లోబల్‌ అడ్వైజర్స్‌ అనే పేరుమీద ఓ రాజకీయ వ్యూహాల సంస్థను నెలకొల్పారు. ప్రస్తుతం దీనికి ఆయన ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.

భారత్‌, కెనడా వివాదం విషయంలో వీలైనంత మేరకు అమెరికా తలదూర్చే అవకాశం ఉండదని చార్లెస్ మైయర్స్ పేర్కొన్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో ఇండియాతో బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంలో అమెరికా ఎంతో పురోగతిని సాధించినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు నెలకొన్న వివాదంలో జోక్యం చేసుకొని అగ్రరాజ్యం దాన్ని పాడు చేసుకునే అవకాశం లేదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు చైనా చేస్తున్న ఆగడాలను అడ్డుకునే విషయంలో కూడా భారత్‌తో అమెరికా చాలా లోతైన సంబంధాలను కొనసాగిస్తూ వస్తుందని వివరించారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఉన్న వివాదం నుంచి అమెరికా దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి కెనడాకు భారత్ సహకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ప్రస్తుత వివాదానికి సంబంధించిన విషయంలో కెనడాకు భారత్‌ సహకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ శుక్రవారం సూచనలు చేశారు. దర్యాప్తును కొనసాగించడం వల్ల వాస్తవాలను వెలుగులోకి రావడం అనేది ముఖ్యమైన అంశాలని తెలిపారు. ఈ విషయంలో చూసుకుంటే తాము జవాబుదారీతనాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. అలాగే మరోవైపు చూసుకున్నట్లైతే ఇండియాపై జస్టీన్ ట్రూడో ఆరోపణలు చేయడానికి ముందు ‘ఫైవ్‌ ఐస్‌’ కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు కెనడాలో ఉన్న అమెరికా రాయబారి డేవిడ్‌ కోహెన్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పెంటగాన్‌ మాజీ అధికారి మైఖేల్‌ రూబిన్‌ కూడా ఈ వ్యవహారంలో పలు వ్యాఖ్యలు చేశారు. రెండు మిత్రదేశాలకు సంబంధించిన విషయంలో అమెరికా ఏ ఒక్కరికో మద్దతుగా నిలుస్తుందని తాను అనుకోవడం లేదని రూబిన్ అన్నారు. అయితే ఒకవేళ అలా ఎంచుకోవాల్సిన పరిస్థితే వస్తే అమెరికా భారత్‌ వైపే మొగ్గు చూపుతుందని చెప్పారు. అలాగే నిజ్జర్‌ ఒక ఉగ్రవాది అని పేర్కొన్నారు. అమెరికాకు భారత్‌ చాలా ముఖ్యమైన దేశమని అన్నారు. కెనడా ప్రధాని హోదాలో జస్టిన్‌ ట్రూడో ఎక్కువకాలం ఉండే అవకాశం లేదని అంచనా వేశారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కెనడాతో తమ బంధాన్ని పునర్నిర్మించుకుంటామని ఆయన చెప్పడం గమనార్హం.