పురుషులను టార్చర్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న మహిళ..
మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో భావోద్వేగాలు ఉంటాయి. అయితే వాటిని చాలావరకు ఎదుటివారు అర్థం చేసుకోలేరు. ఒకరికి నచ్చినటువంటి అనుభవం మరోకరికి నచ్చకపోవచ్చు. రోమాన్స్ అనేది ప్రతిఒక్కరికి వారి జీవితంలో ఓ మధురానుభూతి. సాధారణంగా ఒక జంట పెళ్లి తర్వాత రోమాన్స్ చేసుకుంటారు. మరికొందరైతే పెళ్లికి ముందే చేస్తారు. అయితే కొంతమంది మాత్రం రోమాన్స్‌లో కూడా కొత్త కొత్తగా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు.

మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో భావోద్వేగాలు ఉంటాయి. అయితే వాటిని చాలావరకు ఎదుటివారు అర్థం చేసుకోలేరు. ఒకరికి నచ్చినటువంటి అనుభవం మరోకరికి నచ్చకపోవచ్చు. రోమాన్స్ అనేది ప్రతిఒక్కరికి వారి జీవితంలో ఓ మధురానుభూతి. సాధారణంగా ఒక జంట పెళ్లి తర్వాత రోమాన్స్ చేసుకుంటారు. మరికొందరైతే పెళ్లికి ముందే చేస్తారు. అయితే కొంతమంది మాత్రం రోమాన్స్‌లో కూడా కొత్త కొత్తగా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు. ఇలాంటి కోరిక ఉన్నటువంటి పురుషులకు కావాల్సినంతగా టార్చర్ చేస్తూ.. వాళ్ల నుంచి డబ్బులు వసూలు చేస్తోంది ఇంగ్లండ్‌కు చెందిన ఓ మహిళ. ఆ సమయంలో పురుషులపై ఆమె పూర్తిస్థాయిలో ఆధిపత్యం చెస్తుంది. అంతేకాదు వారిని తీవ్రంగా వేధింపులకు గురిచేస్తుంది. అయితే ఆమె ఇలా చేసేందుకు మాత్రం భారీగా ఫీజులు తీసుకుంటోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాడ్‌లోని సర్రే ప్రాంతానికి చెందిన అరి మక్టాన్స్ అనే మహిళ పురుషులను టార్చర్ చేస్తూ.. కొడుతూ డబ్బులు సంపాదిస్తోంది. అయితే ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇలా డబ్బులిచ్చి మరీ ఆమెతో కొట్టించుకునేందుకు, వేధింపులను ఎదుర్కొనేందుకు పురుషులు కూడా ఆమె ముందు క్యూ కడుతున్నారు. ఇక డైలీ మెయిల్ అనే న్యూస్ వెబ్‌సైట్ తెలిపినటువంటి వివరాల ప్రకారం చూసుకుంటే.. ఆమె ఒక డామినేట్రిక్స్. దీని అర్థం శృంగార సమయంలో పురుషులను వేధించే మహిళ. ఈ పని చేసేందుకు ఆమె గంటకు 17 వేల రూపాయలు తీసుకుంటోంది. తిట్టడం నుంచి తోలు బెల్టుతో కొట్టడం దాకా.. ఆమె ఇలా వివిధ పనులను చేస్తుంది. దీనివల్ల మగవారి నుంచి డబ్బులు సేకరిస్తోంది.
అయితే ఇలా చేయడం వల్ల.. తాను చాలామంది వివాహాలు విచ్ఛిన్నం చేయకుండా కూడా కాపాడినట్లు అరి మక్టాన్స్ తెలిపింది. వాస్తవానికి చాలామంది పురుషులు తమ భాగస్వామి వ్యక్తం చేసే విషయంలో హింస ఉందనుకుంటారని.. అందుకే భార్యకు దూరంగా ఉంటారని పేర్కొంది. కానీ ఆమె మాత్రం ప్రేమలో ఉన్న హింసను అర్థమయ్యేలా చెప్పి.. కాపురాలు నిలబెడుతున్నానని చెప్పింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆమె 19 సంవత్సరాల వయసు నుంచే ఈ పనిని ప్రారంభించడం మొదలుపెట్టింది. అయితే ఆమెకు 25 ఏళ్లు వచ్చేసరికి పూర్తిగా ఓ డామినేట్రిక్స్‌గా మారిపోయింది. వాస్తవానికి ఆమె నెలకు 20 మంది పురుషుల డిమాండ్లను నెరవేరుస్తోందని తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే ఇలా వచ్చేవారితో ఆమె ఎప్పుడూ శారీరక సంబంధాలు పెట్టుకోదు. వారికి ఉన్న వింత కొరికలు మాత్రమే నెరవేరుస్తుంది. అంతేకాదు తన జీవితానికి సపోర్ట్ చేసే బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నాడు.