Zawahiri Death: అల్‌ఖైదా ప్రతీకార దాడులు చేయొచ్చు.. అప్రమత్తంగా ఉండాలని అమెరికా హెచ్చరిక

Ayman al-Zawahiri's Death: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఓ ఇంట్లో తలదాచుకున్న అల్ ఖైదా చీఫ్ అల్ జవహరినీ అగ్రరాజ్యం డ్రోన్ల సహాయంతో క్షిపణి దాడులు చేసి మట్టుపెట్టడం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ విషయాన్ని అధికారికంగానూ ప్రకటించారు.

Zawahiri Death: అల్‌ఖైదా ప్రతీకార దాడులు చేయొచ్చు.. అప్రమత్తంగా ఉండాలని అమెరికా హెచ్చరిక
Al Qaeda Chief Ayman Al Zawahiri (File Photo)
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 03, 2022 | 5:02 PM

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్,  అల్ ఖైదా చీఫ్ అమాన్ అల్-జవహిరిని అమెరికా మట్టుబెట్టిన నేపథ్యంలో ప్రతీకార దాడులు జరగొచ్చని అగ్రరాజ్యం ఈ హెచ్చరిక జారీ చేసింది. వివిధ దేశాల్లో ఉన్న అమెరికన్లు, అమెరికన్ కార్యాలయాలు, సానుభూతి పరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఆ దేశం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఓ ఇంట్లో తలదాచుకున్న అల్ ఖైదా చీఫ్ అల్ జవహరినీ అగ్రరాజ్యం డ్రోన్ల సహాయంతో క్షిపణి దాడులు చేసి మట్టుపెట్టడం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ విషయాన్ని అధికారికంగానూ ప్రకటించారు. జవహరీని హతమార్చడంతో 9/11 ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేసినట్లయిందన్నారు.

జవహరీని మట్టుబెట్టిన తర్వాత అమెరికన్ల పై అల్ ఖైదా ఉగ్రవాదులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశముందని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఆత్మాహుతి దాడులు, హత్యలు, కిడ్నాప్ లు, బాంబు పేలుళ్లు ఇలా ఏ రూపంలోనైనా ఉగ్రవాదులు విధ్వంషాన్ని సృష్టించొచ్చని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని అమెరికన్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని  సూచించింది.

మరోవైపు అల్ జవహరీ హత్యను తాలిబన్లు ఖండించారు. అమెరికా అంతర్జాతీయ నిబంధనలను అతిక్రమించిందని.. 2000వ సంవత్సరంలో కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. అటు తాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా కౌంటరిచ్చింది. అల్-ఖైదా చీఫ్‌కు ఆతిథ్యం, ఆశ్రయం ఇవ్వడం ద్వారా తాలిబన్ దోహా ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మండిపడ్డారు.

మరిన్ని అంతర్జాతీయ కథనాలు చదవండి..