AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: చాక్లెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ కంపెనీ చాక్లెట్స్ టేస్ట్ చేసి చెబితే చాలు.. లక్షల్లో జీతం..5 ఏళ్ల పిల్లలు అర్హులే

మీరు, మీ పిల్లలు చాక్లెట్ ప్రియులు అయితే... ఈ ఉద్యోగం కోసం అప్లై చేయండి.. లక్ ఉంటె.. ఫ్రీగా కావాల్సిన చాక్లెట్స్ తింటూ.. ఎంజాయ్ చేస్తూ.. లక్షలు సంపాదించుకోవచ్చు. అయితే ఈ ఉద్యోగానికి వయసుతో సంబంధం లేదు.. ఈ జాబ్ కోసం 5 ఏళ్ల పిల్లలు కూడా ప్రయత్నించవచ్చు.

Viral News: చాక్లెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ కంపెనీ చాక్లెట్స్ టేస్ట్ చేసి చెబితే చాలు.. లక్షల్లో జీతం..5 ఏళ్ల పిల్లలు అర్హులే
Canadian Company
Surya Kala
|

Updated on: Aug 03, 2022 | 3:22 PM

Share

Canadian Company: చాక్లెట్స్ ను వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. అలాంటి చాక్లెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. చెప్పిందో వ్యాపార సంస్థ.. మీరు  పెద్దగా కష్టపడాల్సిన పని లేదు.. పని లేదు, చాక్లెట్స్ తినండి.. అందుకు తగిన ప్రతిఫలంగా మీకు సంవత్సరానికి లక్షల రూపాయలను జీతంగా ఇస్తామని ప్రకటించింది.  అయితే ఇది జోక్ కాదు.. నిజంగా చాకెట్స్ తిని రుచి చూసి.. చెబితే.. లక్షల రూపాయలను జీవితంగా ఇవ్వడానికి ఓ చాక్లెట్స్  తయారీ సంస్థ రెడీ అయ్యింది. ఈ వింత జాబ్ ఆఫర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాక్లెట్స్  మాత్రమే తినే వారికి ఉద్యోగం ఇవ్వడమే కాదు.. సంవత్సరానికి మన దేశ కరెన్సీలో రూ. 61 లక్షల జీతం కూడా ఇస్తానని ప్రకటించింది.  ఈ జాబ్ ఆఫర్ పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మీరు కూడా చాక్లెట్స్ ప్రేమికులైతే.. క్యాండీ ఫన్‌హౌస్ ఇస్తోన్న ఈ అద్భుతమైన జాబ్ ఆఫర్‌పై ఓ లుక్ వేయండి. వాస్తవానికి, ఈ కెనడియన్ కంపెనీ చీఫ్ క్యాండీ ఆఫీసర్ కోసం వెతుకుతోంది. ఈ ఉద్యోగస్తుల విధి ఏమిటంటే..  చాక్లెట్స్ ను పరీక్షించడం, దాని రుచి.. ఏవిధంగా మరింత టేస్టీగా తయారు చేయాలనీ వంటి సూచనలు ఇవ్వడం. ఈ పోస్టుకు ఎంపికైన వ్యక్తికి సంవత్సరానికి $100,000 కెనడియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 61.36 లక్షలు) చెల్లించడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ఈ మేరకు సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన కూడా చేసింది.

ఇవి కూడా చదవండి

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడంటే..  కంపెనీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా @candyfunhouseca లో ఒక ఉద్యోగ ప్రకటన చేసింది. అందులో కంపెనీ చీఫ్ క్యాండీ ఆఫీసర్ కోసం వెతుకుతున్నట్లు రాసి ఉంది.  అయితే ఈ ఉద్యోగానికి వయసుతో సంబంధం లేదు.. ఈ జాబ్ కోసం 5 ఏళ్ల పిల్లలు కూడా ప్రయత్నించవచ్చు. పిల్లల తల్లిదండ్రులు కావాలంటే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది. మరి ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ఆగస్టు 31వ తేదీని చివరి తేదీగా కంపెనీ ప్రకటించింది. మరి  ఆలస్యం ఎందుకు మీరు, మీ పిల్లలు చాక్లెట్ ప్రియులు అయితే… ఈ ఉద్యోగం కోసం అప్లై చేయండి.. లక్ ఉంటె.. ఫ్రీగా కావాల్సిన చాక్లెట్స్ తింటూ.. ఎంజాయ్ చేస్తూ.. లక్షలు సంపాదించుకోవచ్చు.

మరిన్ని అంతార్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..