Viral Video: భక్తులకు గోల్డెన్‌ ఆఫర్‌.. బంగారు బిస్కెట్‌పై గణేశుడు.. రాయల్‌ మింట్‌ ఆవిష్కరణ

ఏ పనులు తలపెట్టిన విఘ్నాలు లేకుండా కాపాడేవాడు. చివరకు ఏ శుభకార్యాలు తలపెట్టిన ముందుగా పూజలు అందుకునే ఆది దేవుడు.

Viral Video: భక్తులకు గోల్డెన్‌ ఆఫర్‌.. బంగారు బిస్కెట్‌పై గణేశుడు.. రాయల్‌ మింట్‌ ఆవిష్కరణ
Ganesh
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 03, 2022 | 2:57 PM

ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరుల పుత్రుడు గణపతి. వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. ఏ పనులు తలపెట్టిన విఘ్నాలు లేకుండా కాపాడేవాడు. చివరకు ఏ శుభకార్యాలు తలపెట్టిన ముందుగా పూజలు అందుకునే ఆది దేవుడు. ప్రతీయేటా భక్తులు వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఆగస్టు 31న వినాయక చవితిని పురస్కరించుకుని బ్రిటన్‌లోని రాయల్‌ మింట్‌ 24 క్యారట్ల బంగారంతో వినాయకుడి ప్రతిమతో కూడిన బిస్కెట్‌ను విడుదల చేసింది. 20 గ్రాముల స్వచ్ఛమైన బంగారంతో తయారుచేసిన ఈ గోల్డ్‌ బార్‌ ధరను రూ.1,06,578గా నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. గత సంవత్సరం దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి ప్రతిమతో కూడిన బిస్కెట్‌లను రాయల్‌ మింట్‌ ముద్రించింది. వేల్స్‌లోని కార్డిఫ్‌లో ఉన్న స్వామినారాయణ్‌ దేవాలయానికి చెందిన నీలేశ్‌ కబారియాతో కలిసి ఈ బిస్కెట్‌లను రూపొందించారు. వీటిని రాయల్‌ మింట్‌ వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయొచ్చనని ప్రకటించారు.