“మందంటే చేదా.. నీకాఉద్దేశం లేదా”..!! నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

ఇక మందేసిన తర్వాత వారి వీరంగం చూడాల్సిందే..దీనికి సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో ఓ తాగుబోతు ఎలాంటి జిమ్మిక్కు చేశాడో... మొదట మీరు ఈ వీడియో చూడండి,

మందంటే చేదా.. నీకాఉద్దేశం లేదా..!! నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో
Viral
Jyothi Gadda

|

Aug 03, 2022 | 2:49 PM

తాగుబోతుల చేష్టలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు.. అందుకే మద్యం ఆరోగ్యానికి హానికరం అంటారు. కానీ, మందుబాబుల మనోభావాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటాయి. మందుబాబులకు గొంతులో చుక్కపడందే..ఏ పని జరగదంటారు. ఇక మందేసిన తర్వాత వారి వీరంగం చూడాల్సిందే..దీనికి సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో ఓ తాగుబోతు ఎలాంటి జిమ్మిక్కు చేశాడో… మొదట మీరు ఈ వీడియో చూడండి, మొత్తం విషయం మీకే అర్థమవుతుంది.

వీడియో స్టార్ట్ కాగానే ఓ వ్యక్తి మద్యాన్ని వదిలించుకోవాలని ఆరాటపడుతున్నట్లు కనిపిస్తుంది.. బాటిల్ చూడగానే పరిగెత్తడం మొదలుపెడతాడు. అవతలి వ్యక్తి చేతిలో మద్యం బాటిల్‌తో అతని వైపు నడుస్తున్నాడు. ఈ మద్యం నుంచి తనను ఎవరో ఒకరు కాపాడగలరన్న రీతిలో పరుగులు తీస్తున్నాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో చూడగానే అందరికి షాక్‌ తగిలినంత పనవుతుంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. అకస్మాత్తుగా అతని స్నేహితుడు మద్యం సీసాతో అక్కడికి వచ్చి దానిని అందిస్తాడు. అయితే తనకు మద్యం ముట్టడం కూడా ఇష్టం లేదన్నట్టుగా ఆ వ్యక్తి వివరించేందుకు ప్రయత్నించాడు. వీడియో చూడగానే మద్యం తాగను అని ప్రమాణం చేసినట్టు అనిపిస్తుంది. మందుముట్టను బాబోయ్ అన్నట్టుగా అతను పరుగెత్తడం ప్రారంభించాడు. నేలమీద పడిపోయి మరీ ఓవరాక్షన్‌ చేశాడు. కిందపడి పాకుతూ వెళ్లి..నోరు దాచుకుంటాడు.. అంతలోనే అకస్మాత్తుగా అతనిలోపల దాగివున్న తాగుబోతు నిద్ర లేచాడు. అప్పుడు జరిగిన విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

View this post on Instagram

A post shared by memes comedy (@ghantaa)

నేలపై పడిపోయిన ఆ వ్యక్తి అసంకల్పితంగా తిరుగుతూ వైన్ కోసం ఒక గ్లాసును చేత్తోపట్టుకుని వచ్చాడు. అంటే తాగుబోతు చివరకు మద్యం ముందు లొంగిపోయాడు. తాగుబోతుల ఈ జిమ్మిక్కు చూసి నవ్వు ఆపుకోలేరు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu