AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi-Joe Biden: “మీకు ఇంత ఫాలోయింగ్ ఎలా వచ్చింది..” ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌..

జీ7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, మన ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఉన్న పాపులారిటీ గురించి ప్రస్తావించారు అమెరికా అధ్యక్షుడు బిడెన్.. "బహుశా నేను మీ ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలి’’ అని అమెరికా బైడెన్‌ సరదాగా అనడంతో..

PM Modi-Joe Biden: మీకు ఇంత ఫాలోయింగ్ ఎలా వచ్చింది.. ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌..
Pm Modi Joe Biden
Sanjay Kasula
|

Updated on: May 21, 2023 | 12:18 PM

Share

జపాన్‌లో జరుగుతున్న G-7 శిఖరాగ్ర సమావేశాల్లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. ఈ విశయం వివిధ సందర్భంల్లో జరిగిన సర్వేల్లో బయటపడింది. ప్రధాని మోదీ ఏ దేశానికి వెళ్లినా ఫ్యాన్ ఫాలోయింది మాములూగా ఉండదు. ఆయనను కలిసేందుకు అక్కడి పెద్ద క్యూ కడుతుంటారు. ముఖ్యంగా ప్రధాని మోదీ అక్కడ బహిరంగా సమావేశాలు ఏర్పాటు చేస్తే.. ఆయన ప్రయాణించే దారి పొడవునా స్వాగతం పలికుతూ జనం కనిపిస్తుంటారు. ఇలాంటి ఘటనలు మనం చాలా సార్లు చూశాం. అయితే తాజాగా మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకొంది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన మనసులోని మాటను బయటపెట్టారు.

ప్రధాని మోదీ హిరోషిమా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడికొచ్చిన వివిధ దేశాధినేతలతో ఆయన కాసేపు వ్యక్తిగతంగా ముచ్చటించారు. వార్తా సంస్థ ANI లో ప్రచురించిన నివేదిక ప్రకారం, క్వాడ్ దేశాలు అనగా అమెరికా, ఆస్ట్రేలియా, భారతదేశం మరియు జపాన్‌ల ముఖ్యమైన సమావేశం సందర్భంగా, US అధ్యక్షుడు జో బిడెన్ తన దేశంలో ఒక ఆసక్తికరమైన సవాలును ఎదుర్కొంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారు. ఈ సందర్భంగా జో బైడెన్‌ తాను తాజాగా ఓ పెద్ద సమస్యను ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రధాని మోదీ ముందుంచారట. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆహ్వానం మేరకు జూన్ నెలలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.

ఈ సందర్భాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ప్రధాని మోదీ మధ్య ఓ సరదా సన్నివేశం చోటు చేసింది. మోదీతో బైడెన్ మాట్లాడుతూ.. మీరు మాదేశం వస్తున్నారంటే అనేక మంది ఆసక్తి చూపుతున్నారని బైడెన్‌ మన ప్రధాని దృష్టికి తీసుకొచ్చారని వారి సంభాషణను విన్న విశ్వసనీయ వర్గాలు మీడియాతో పంచుకున్నాయి. తనకు అనేక వర్గాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని ప్రధాని మోదీకి బైడెన్ తెలియజేశారట. తానెప్పుడూ కలవని.. పరిచయం లేని వారు సైతం ఫోన్లు చేసి ప్రధాని మోదీతో కలిసే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు బైడెన్ అన్నట్లుగా సమాచారం.

ఇంతలోనే అక్కడికొచ్చిన వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్‌.. తాను కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నానని చెప్పినట్లుగా సమాచారం. మరో వారంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రధాని మోదీ ఓ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అయితే, ఈ సమావేశంలో పాల్గొనేందుకు తమకు చాన్స్ ఇప్పించాలని తనకు వ్యక్తిగతంగా అడుగుతున్నారని.. ఆస్ట్రేలియాలోని కొందరు ప్రముఖులు కూడా మెసెజ్ చేస్తున్నారని మోదీతో ఆల్బనీస్‌ అన్నట్లుగా తెలుస్తోంది.

అయితే, ప్రధాని మోదీ పాల్గొనబోయే వేదిక కేవలం 20 వేల మందికి మాత్రమే అనుకూలంగా ఉండటంతో ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయని చెప్పినప్పటికీ వారి నుంచి మెసెజ్‌లు తగ్గడం లేదని తెలిపారని వారి సంభాషణను విన్నవారు మీడియాకు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వర్తల కోసం