US Election: బైడెన్‌ అధ్యక్ష అభ్యర్థిత్వంపై క్లారిటీ.. ఎన్నికల్లో ట్రంప్‌నును ఓడిస్తాః జో బైడెన్‌

ఎట్టకేలకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ పోటీపై క్లారిటీ వచ్చింది. అధ్యక్ష అభ్యర్థిత్వంపై జరుగుతున్న ప్రచారానికి బైడెన్‌ చెక్‌ పెట్టారు. బైడెనే ఎక్ట్స్‌ ప్రెసిడెంట్‌ అంటూ కీలక ప్రకటన చేసింది వైట్‌హౌస్‌. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తానే డెమెక్రాటిక్ పార్టీ అభ్యర్థినని జో బైడెన్‌ తేల్చి చెప్పారు.

US Election: బైడెన్‌ అధ్యక్ష అభ్యర్థిత్వంపై క్లారిటీ.. ఎన్నికల్లో ట్రంప్‌నును ఓడిస్తాః జో బైడెన్‌
Joe Biden
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 04, 2024 | 8:36 PM

ఎట్టకేలకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ పోటీపై క్లారిటీ వచ్చింది. అధ్యక్ష అభ్యర్థిత్వంపై జరుగుతున్న ప్రచారానికి బైడెన్‌ చెక్‌ పెట్టారు. బైడెనే ఎక్ట్స్‌ ప్రెసిడెంట్‌ అంటూ కీలక ప్రకటన చేసింది వైట్‌హౌస్‌. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తానే డెమెక్రాటిక్ పార్టీ అభ్యర్థినని జో బైడెన్‌ తేల్చి చెప్పారు. అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలని తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. ట్రంప్‌ను ఓడించేందుకు తమకు అండగా నిలవండంటూ మద్దతుదారులకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

కొంతకాలం నుంచి బైడెన్ వయస్సు పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, మతిమరుపు కూడా వచ్చిందని కొంతమంది విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్‌ – బైడెన్‌ మధ్య ఇటీవల జరిగిన ప్రత్యక్ష చర్చ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లో బైడెన్ పూర్తిగా తేలిపోయారు. ఈ చర్చలో తడబాటుకు గురయ్యారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్న సమయంలో బైడెన్ తన ప్రత్యర్థిని ఎదుర్కొవడంలో ఇబ్బందులు పడటం డెమోక్రాటిక్‌‌ పార్టీలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఆయన గెలుపుపై స్వపక్షంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇటీవల అధ్యక్ష బరి నుంచి జో బైడెన్ తప్పుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ ప్రచారానికి చెక్‌ పెడుతూ… తాను తప్పుకోవడంలేదని, తుది వరకూ బరిలోనే ఉంటానని తేల్చిచెప్పారు బైడెన్. ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సాయంతో తాను నవంబరులో జరిగే ఎన్నికల్లో ట్రంప్‌ను ఒడిస్తానన్నారు. మరోవైపు వైట్‌ హౌస్‌ కూడా బైడెన్‌ అధ్యక్ష అభ్యర్థిత్వంపై క్లారిటీ ఇచ్చింది. బైడెన్‌ పోటీ నుంచి తప్పుకోవడం లేదని స్పష్టంచేసింది. మరో నాలుగేళ్ల పాటు బైడెన్‌ సమర్థంగా పని చేయగలరని భావిస్తున్నామని అధికార ప్రతినిధి కరీన్‌ జీన్-పియర్ అన్నారు. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఆయనకున్న పాలనా అనుభవం మరెవరికీ లేదని తెలిపారు. ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లో తడబాటుపై ఆయన ఇప్పటికే క్లారిటీ ఇచ్చారని కరీన్ జీన్-పియర్ గుర్తుచేశారు. ఇలాంటి ఆందోళనలు వ్యక్తమవడం సహజమే అయినప్పటికీ.. గతంలో ఆయన పనితీరును గమనించాలని సూచించారు. నాలుగేళ్లుగా అమెరికాకు చేస్తున్న సేవలను మరవద్దని సూచించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…