Donald Trump: తగ్గేదేలే.. అంతా నా ఇష్టం.. ఆ మూడు దేశాలపై ట్రంప్ ట్రేడ్ వార్..
అంతా నా ఇష్టం అంటున్నారు డొనాల్డ్ ట్రంప్... అమెరికా ఫస్ట్ అంటూనే, ఇతర దేశాలపై సుంకాలు ఝళిపిస్తున్నారు. ఇందుకోసం సంతకాల మీద సంతకాలు చేస్తున్నారు. కెనడా , చైనా , మెక్సికోపై వాణిజ్య యుద్దం ప్రకటించారు ట్రంప్. కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన సమయంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పాలన ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. అమెరికన్లను రిచ్‌గా మార్చడమే తన లక్ష్యమని చెప్పిన ట్రంప్..విదేశాలపై భారీ టారిఫ్‌లు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఆ ప్రకటనకు తగ్గట్టుగానే తన నిర్ణయాలను అమలు చేస్తున్నారు ట్రంప్. ముఖ్యంగా చైనాతో అమెరికా పంచాయితీని కంటిన్యూ చేసేలా ఓ నిర్ణయం తీసుకున్నారు. వచ్చీ రాగానే చైనాతో ట్రేడ్‌వార్ మొదలు పెట్టారు. చైనా ఉత్పత్తులపై అమెరికాలో 10% టారిఫ్ విధించారు. ఇకపై వాణిజ్య యుద్ధం ఎలా ఉంటుందో ఓ ట్రైలర్ చూపించారు. ఈ డిసిషన్‌తో ఒక్కసారిగా చైనా షాక్ అయింది. ట్రంప్ తీరు గురించి తెలిసినప్పటికీ..మరీ ఇంత తొందరగా ఈ ట్రేడ్ వార్ మొదలు పెడతాడని అనుకోలేదు డ్రాగన్. ఇప్పటికే ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసహనంతో ఉంది. అమెరికాలోని చైనా ఎంబసీ ఓ ట్వీట్ కూడా చేసింది. ట్రేడ్ వార్‌లో విజేతలు అంటూ ఎవరూ ఉండరు అని ఫిలాసఫీ చెబుతోంది.. చైనా విదేశాంగ శాఖ.
చైనా విదేశాంగ శాఖ వాదిస్తోంది ఒకటే. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్‌ని(World Trade Organisation) ట్రంప్ పట్టించుకోవడం లేదని మండిపడుతోంది. చైనా ఉత్పత్తులపై అదనంగా 10% మేర టారిఫ్‌లు విధించడం దారుణమని, దీనిపై కచ్చితంగా పోరాటం చేస్తామని ప్రకటించింది. ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వారిస్తోంది. అంతే కాదు. ఇలా వాణిజ్య యుద్ధం మొదలు పెట్టడం వల్ల ఇటు తమకు కానీ..అటు అమెరికాకి కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెబుతోంది. రెండు దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ఇది మాత్రమే మార్గం కాదని అంటోంది చైనా..
మరో రెండు దేశాలపై కూడా..
కేవలం చైనాపైనే కాదు. మెక్సికో, కెనడాపైనా ఇదే విధంగా భారీ టారిఫ్‌లు విధిస్తూ ఆదేశాలపై సంతకాలు చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇందుకు ప్రతీకారంగా కెనడా కూడా అమెరికాపై టారిఫ్‌లు విధించింది. ఈ కారణంగా అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని కెనడా వార్నింగ్ ఇస్తోంది. అయితే..అమెరికన్ల ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు ట్రంప్. అవసరమైతే..అమెరికన్ల నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ వసూళ్లను ఆపేసి..అందుకు బదులుగా విదేశాలపై భారీ టారిఫ్‌లు విధిస్తామని హింట్ ఇచ్చారు. వేరే దేశాలపై తక్కువ పన్నులు వేసి..అమెరికన్లపై ఎక్కువ ట్యాక్స్ ఎందుకు వేయాలని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో బహుశా ట్రంప్..ఈ నిర్ణయం కూడా తీసుకునే అవకాశం లేకపోలేదు.
మరిన్ని ప్రపంచ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..