AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క అర్డర్‌తో.. 788 మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్‌పై నీళ్లు చల్లిన డొనాల్డ్ ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-హార్వర్డ్ యూనివర్సిటీ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత ఆగే సంకేతాలు కనిపించడం లేదు. ఇంతలో, ట్రంప్ ప్రభుత్వం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులు ప్రస్తుతానికి హార్వర్డ్‌లో ప్రవేశం పొందలేరు. విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని నిలిపివేసిస్తూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో భారతదేశం తోపాటు ప్రపంచంలోని ఇతర దేశాల విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఒక్క అర్డర్‌తో.. 788 మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్‌పై నీళ్లు చల్లిన డొనాల్డ్ ట్రంప్!
Donald Trump On Harvard University
Balaraju Goud
|

Updated on: May 23, 2025 | 9:40 AM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-హార్వర్డ్ యూనివర్సిటీ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత ఆగే సంకేతాలు కనిపించడం లేదు. ఇంతలో, ట్రంప్ ప్రభుత్వం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులు ప్రస్తుతానికి హార్వర్డ్‌లో ప్రవేశం పొందలేరు. విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని నిలిపివేసిస్తూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో భారతదేశం తోపాటు ప్రపంచంలోని ఇతర దేశాల విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) కార్యదర్శి క్రిస్టి నోయెమ్, ఈ మేరకు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి లేఖను పంపారని న్యూయార్క్ టైమ్స్ ఈ వార్తను అందించింది. “హార్వర్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థి, విద్యా మార్పిడి ప్రవేశ కార్యక్రమం గుర్తింపు రద్దు చేస్తున్నట్లు తెలియజేయడానికి లేఖ వ్రాస్తున్నాను, ఇది వెంటనే అమలులోకి వస్తుంది” అని నోయెమ్ లేఖలో రాశారు.

788 మంది భారతీయ విద్యార్థుల పరిస్థితేలంటి?

హార్వర్డ్ అధికారిక రికార్డుల ప్రకారం, ప్రతి సంవత్సరం 500 నుండి 800 మంది భారతీయ విద్యార్థులు ఇక్కడ ప్రవేశం పొందుతున్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 6,800 మంది విద్యార్థులు ఇక్కడికి వస్తారు. ఈ సంవత్సరం 788 మంది భారతీయ విద్యార్థులు ప్రవేశం పొందారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో, ఈ విద్యార్థుల సమస్యలు పెరగబోతున్నాయి. విదేశీ విద్యార్థులు వేరే సంస్థలో అడ్మిషన్ తీసుకోవాలని లేదా అమెరికాలో వారి చట్టపరమైన హోదాను కోల్పోవాలని కోరారు. అందువల్ల, భారతీయ విద్యార్థులు మరొక సంస్థలో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. వారు అలా చేయకపోతే, వారు అమెరికా వదిలి వెళ్ళవలసి రావచ్చు.

హార్వర్డ్‌లో ప్రస్తుత సెమిస్టర్ పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రం ఒక ఉపశమన వార్త. వారు తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగలుగుతారు. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) కార్యదర్శి క్రిస్టి నోయెమ్ తన లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ట్రంప్ ప్రభుత్వం చేసిన మార్పు 2025-26 విద్యా సంవత్సరం నుండి అమలు చేయడం జరుగుతుందని ఆయన రాశారు.

ట్రంప్-హార్వర్డ్ మధ్య వివాదం ఎందుకు?

డొనాల్డ్ ట్రంప్-హార్వర్డ్ మధ్య వివాదం నెలకొంది. ట్రంప్ పరిపాలన తన సొంత కోరికల ప్రకారం విశ్వవిద్యాలయాన్ని నడపాలని కోరుకుంటుంది. కానీ హార్వర్డ్ దీనికి పూర్తిగా సిద్ధంగా లేదు. యూదులపై ద్వేషాన్ని ఆపడంలో హార్వర్డ్ విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. యూదు విద్యార్థులు, ప్రొఫెసర్లపై వివక్ష ఉందని ట్రంప్ సర్కార్ ఆరోపించింది. ఇప్పుడు విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విశ్వవిద్యాలయంపై పెరుగుతున్న ఒత్తిడి ఇదే అనిపిస్తుందంటున్నారు నిపుణులు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..