భారతీయ విద్యార్థులకు మరో బిగ్ షాక్.. స్టడీ పర్మిట్లకు కోత విధించిన కెనడా..!
అమెరికా తర్వాత భారతీయ విద్యార్థుల కలల ప్రపంచం కెనడా. కానీ మన విద్యార్థుల ఆశలను చిదిమేస్తోంది కెనడా ప్రభుత్వం. భారతీయ విద్యార్థులకు తలుపులు మూసేస్తోంది. వీసాలను గణనీయంగా తగ్గించేస్తోంది. అక్కడ ఇప్పటికే ఉన్న విద్యార్థులు పార్ట్‌టైమ్ జాబ్‌లు కూడా దొరక్క అల్లాడిపోతున్నారు. తాజా ఉత్తర్వులతో మరింత గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి.

అమెరికా తర్వాత భారతీయ విద్యార్థుల కలల ప్రపంచం కెనడా. కానీ మన విద్యార్థుల ఆశలను చిదిమేస్తోంది కెనడా ప్రభుత్వం. భారతీయ విద్యార్థులకు తలుపులు మూసేస్తోంది. వీసాలను గణనీయంగా తగ్గించేస్తోంది. అక్కడ ఇప్పటికే ఉన్న విద్యార్థులు పార్ట్‌టైమ్ జాబ్‌లు కూడా దొరక్క అల్లాడిపోతున్నారు. తాజా ఉత్తర్వులతో మరింత గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి.
భారతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్లలో కెనడా దాదాపు 31శాతం కోతపెట్టింది. IRCC గణాంకాలు చూస్తుంటే కెనడాపై భారతీయ విద్యార్థులు ఇక ఆశలు వదులుకోవాల్సిందే. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కెనడాలో భారతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లు 31శాతం తగ్గాయి. 2028 నాటికి కెనడా జనాభాలో తాత్కాలిక నివాసితులను 5శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అక్కడి ప్రభుత్వం. ఈ ఏడాది దేశంలోకి విదేశీ విద్యార్థులకు అనుమతులను 4లక్షల 37వేలకు పరిమితం చేసింది.
2025 మొదటి త్రైమాసికంలో కేవలం 30వేల 640మంది భారతీయ విద్యార్థులకే కెనడాలోకి ఎంట్రీ లభించింది. 2024లో ఇదే పీరియడ్‌లో 44వేల295 మందిని అనుమతించిన కెనడా.. ఏడాది తిరిగేసరికి వీసాల్లో ఏకంగా 31శాతం కోత విధించింది. 2023 చివరి నుంచీ దేశంలోకి వలసలను అరికట్టడానికి కెనడా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో విద్యార్థులపై దాని ప్రభావం పడుతోంది. 2023లో కెనడా మొత్తం 6లక్షల 81వేల155 స్టడీ పర్మిట్లు జారీ చేసింది. వాటిలో 2లక్షల 78వేలమంది భారతీయులు. 2024లో మొత్తం పర్మిట్ల సంఖ్య 5లక్షల16వేల 275కి పడిపోయింది, భారతీయ విద్యార్థుల సంఖ్య లక్షా 88వేల 465కి తగ్గింది.
విద్యార్థులు, విదేశీ కార్మికులతో సహా కెనడాలో టెంపరరీ రెసిడెంట్స్ సంఖ్య 2028 నాటికి దేశ జనాభాలో 5శాతానికి మించకూడదనే నియమం పెట్టుకుంది అక్కడి ప్రభుత్వం. అందులోభాగంగానే 2025కి స్టడీ పర్మిట్‌లను IRCC 4లక్షల 37వేలకు పరిమితం చేసింది. స్టడీ పర్మిట్ నిబంధనల్లోనూ మార్పులు చేసింది. దీంతో కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది.
జస్టిస్ ట్రూడో ఉన్నన్నాళ్లూ కెనడా- భారత్ మధ్య సత్సంబంధాలు లేవు. మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక కూడా పెద్ద మార్పేమీ లేదు. విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా ఉండటం.. గృహ, ఆరోగ్య, ఇతర ప్రజాసేవలకు భారంగా మారుతోందని భావిస్తోంది కెనడా. అందుకే భారతీయ విద్యార్థులకు కేటాయించే స్టడీ పర్మిట్లను 31శాతం తగ్గించింది. అదే సమయంలో చైనా విద్యార్థులను మాత్రం కేవలం 3శాతానికే కుదించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
