AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Rewards: క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లను నగదుగా మార్చి ఏకంగా రూ. 2.17 కోట్ల సంపాదన ఎక్కడంటే..!

Credit Card Rewards: డెబిట్ , క్రెడిట్ కార్డులు, ఆన్ లైన్ ట్రాన్ సెక్షన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కువగా వాటిద్వారానే చెల్లింపులు చేస్తున్నాం.. అయితే..

Credit Card Rewards: క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లను నగదుగా మార్చి ఏకంగా రూ. 2.17 కోట్ల సంపాదన ఎక్కడంటే..!
Credit Card
Surya Kala
|

Updated on: Jun 01, 2021 | 7:41 PM

Share

Credit Card Rewards: డెబిట్ , క్రెడిట్ కార్డులు, ఆన్ లైన్ ట్రాన్ సెక్షన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కువగా వాటిద్వారానే చెల్లింపులు చేస్తున్నాం.. అయితే ఇలా చెల్లింపులు చేసే సమయంలో రివార్డ్ పాయింట్స్ అందుకుంటున్నారు. వీటి ద్వారా, ప్రజలు కొన్నిసార్లు కొన్ని వేల రూపాయల వరకు సంపాదించగలుగుతున్నారు. అయితే అలాంటి రివార్డు పాయింట్లతోనే ఏకంగా కోటీశ్వరుడై అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

US భౌతిక శాస్త్రవేత్త కాన్ స్టాంటిన్ ఆంకీవ్ తన బుర్రకు పదును పెట్టాడు.. క్రెడిట్ కార్డు వినియోగంతో లభించే రివార్డు పాయింట్లు డబ్బులుగా మార్చుకున్నాడు.. డిట్ కార్డు వినియోగించడం ద్వారా లభించే రివార్డు పాయింట్లు ఆదా చేసి ఏకంగా రూ .2 కోట్ల 17 లక్షల వరకు సంపాదించాడు. ఈ భౌతిక శాస్త్రవేత్త 2009 నుంచి ఇదొక అలవాటుగా మార్చుకున్నాడు. అది కూడా చాలా తెలివిగా చేసేవాడు. కాన్ స్టాంటిన్ తన క్రెడిట్ కార్డు నుండి పెద్ద సంఖ్యలో బహుమతి కార్డులను కొనడం ప్రారంభించాడు. అతను మొదట బహుమతి కార్డును కొనుగోలు చేసి, దానిని ఎన్‌కాష్ చేస్తాడు. అతను ఈ డబ్బును తిరిగి తన బ్యాంకు ఖాతాలో జమ చేసి, క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించేవాడు.

ఉదాహరణకు US $ 500 బహుమతి కార్డును కొనుగోలు చేస్తే అతను బహుమతిగా US $ 25 పొందుతాడు. బహుమతి కార్డును ఎన్కాష్ చేయడానికి, అతను US $ 6 చెల్లించాల్సి ఉంది. అప్పుడు అతనికి US $ 19 లభిస్తుంది. ఇలా 2009 నుంచి రివార్డ్ పాయింట్స్ తో సుమారు రూ. 217 మిలియన్లు సంపాదించాడు. పనీపాటా చేయకుండానే అంత సొమ్ము రావడంతో కొందరు అతడిపై ఐటీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ రివార్డు పాయింట్ల వ్యవహారం వెల్లడైంది. వెంటనే రంగంలోకి దిగిన యుఎస్ టాక్స్ ఆఫీసర్లు దర్యాప్తుచేసి..అతనికి నోటీసులు పంపింది. ఆ తర్వాత ఈ విషయం కోర్టుకు చేరుకుంది. క్రెడిట్ కార్డ్ కంపెనీలు అతనికి ఇచ్చిన డిస్కౌంట్లు మరియు రివార్డులు వినియోగదారుల ఆదాయాలు కాదని కాన్ స్టాంటిన్ తరపున లాయర్ వాదించాడు.

రెండు పార్టీల వాదనలు విన్న తరువాత, బహుమతి కార్డులు ఆస్తి లాంటివని, కొనుగోలుపై అందుకున్న రివార్డులు (క్రెడిట్ కార్డ్ రివార్డులు) పన్ను విధించవని కోర్టు తెలిపింది. అయితే ఈ కేసులో రివార్డులు తగ్గింపు. బహుమతి కార్డును తిరిగి నగదుగా మార్చారని, అతను లాభం కోసం చేసిన ఈ పనికి ఆదాయపు పన్ను చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇలా రివార్డ్స్ పాయింట్స్ ను నగదుగా మార్చుకుంటే ఆ వినియోగదారుడు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. కోర్టు నిర్ణయం తరువాత, ఆదాయపు పన్ను విభాగం ఇప్పుడు అనికీవ్ నుండి పన్ను వసూలు చేసే పనిలో పడింది. అయితే అధికారులు నెటిజన్లు శాస్త్రవేత్త తెలివికి ఫిదా అవుతున్నారు.

Also Read:వృక్ష రూపంలో కొలువైన నరసింహస్వామి దివ్యక్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా..!