AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Gun Violence: అమెరికాలో గన్‌ కల్చర్‌కు చెక్‌ పెట్టేందుకు బైడన్ కీలక నిర్ణయం.. ఆ తుపాకుల కొనుగోళ్లపై నిషేధం

గన్‌ కల్చర్‌కు చెక్‌పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు బైడెన్‌. కొన్ని ఆయుధాలను నిషేధించడంతో పాటు కొనుగోళ్లపై నియంత్రణ పెడతామని ప్రకటించారు.

US Gun Violence: అమెరికాలో గన్‌ కల్చర్‌కు చెక్‌ పెట్టేందుకు బైడన్ కీలక నిర్ణయం.. ఆ తుపాకుల కొనుగోళ్లపై నిషేధం
Joe Biden
Shaik Madar Saheb
|

Updated on: Jun 04, 2022 | 7:40 AM

Share

US gun violence: అమెరికాలో తుపాకీ కొనడం, కాల్చడం బబుల్‌ గమ్‌ నమిలేసింత ఈజీ.. విచ్చలవిడి తుపాకుల మోతలో ఎందరో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. గత నాలుగు రోజులుగా అగ్రరాజ్యంలోని పలు నగరాల్లోని పాఠశాలలు, ఆస్పత్రులు, షాపింగ్‌ కేంద్రాల్లో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టించాయి. పదుల సంఖ్యలో సామాన్యులు ప్రాణాలు కోల్పారు. ఈ ఘటనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కీలక నిర్ణయాలను ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఏకే 47, ఏకే 15 తదితర తొమ్మిది రకాల తుపాకులను నిషేధిస్తూ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు బైడన్‌.. అమెరికాలో తుపాకీ కొనేందుకు కనీస వయోపరిమితి 18 ఏళ్లు ఉంది.. దీన్ని 21 ఏళ్లకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలో గత రెండు దశాబ్దాలుగా పోలీసులు, ఆర్మీ సిబ్బంది కంటే చిన్నారులే ఈ తుపాకీలకు బలవుతున్నారని జో బైడన్ (Joe Biden) ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. కఠినతరమైన తుపాకీ నిషేధ చట్టాలను తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని బైడెన్‌ తెలిపారు. ఈ దిశగా అమెరికా చట్ట సభలు తగిన చర్యలు చేపట్టాలని పిలుపునిచారు.

కాగా బైడెన్‌ విజ్ఞప్తిపై ఆయన పార్టీకి చెందిన డెమోక్రాట్స్‌ సభ్యులు సానుకూలంగా స్పందించగా, రిపబ్లిక్‌లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆత్మరక్షణ కోసం తుపాకుల వాడకానికి అనుమతించాలని అంటున్నారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. హింసాత్మక కాల్పులు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేస్తే చాలంటున్నారు.. రిపబ్లికన్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బైడెన్‌ వారికి మనస్సాక్షి లేదని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..