మాస్క్ లేకుండా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డ్యాన్స్.. 60 వ బర్త్ డే సెలబ్రేషన్స్ లో సందడి

అమెరికాలో ఓ వైపు డెల్టా వేరియంట్ కేసులు పెరిగిపోతుండడంతో ప్రతివారూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఓ వైపు అధ్యక్షుడు జోబైడెన్ పిలుపునిస్తుండగా మరో వైపు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాస్క్ లేకుండానే నిన్న తన 60 వ బర్త్ డే సెలబ్రేషన్స్ ని ఘనంగా జరుపుకున్నారు.

మాస్క్ లేకుండా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డ్యాన్స్.. 60 వ బర్త్ డే సెలబ్రేషన్స్ లో సందడి
Obama
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Nov 17, 2022 | 1:18 PM

అమెరికాలో ఓ వైపు డెల్టా వేరియంట్ కేసులు పెరిగిపోతుండడంతో ప్రతివారూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఓ వైపు అధ్యక్షుడు జోబైడెన్ పిలుపునిస్తుండగా మరో వైపు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాస్క్ లేకుండానే నిన్న తన 60 వ బర్త్ డే సెలబ్రేషన్స్ ని ఘనంగా జరుపుకున్నారు. మసాచ్యూసెట్స్ లోని మార్తా వైన్ యార్డులో నిన్న రాత్రి జరిగిన ఈ సెలబ్రేషన్స్ కి సుమారు 500 మంది హాజరయ్యారు. చాలా మంది అసలు మాస్కుల జోలికి పోలేదు. మైక్ పట్టుకుని ఒబామా తన అభిమానులు, మద్దతుదారులతో హుషారుగా డ్యాన్స్ చేయడం విశేషం. ఈ వీడియోను 50 ఏళ్ళ సింగర్, సాంగ్ రైటర్ కూడా అయిన ఎరికా బాడు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది… తన బృందంతో కొద్దిసేపు పర్ ఫామ్ చేసిన ఈమె.. ఒబామా అటు తిరగగానే కామ్ గా వెనక్కి వచ్చి ఆయన పూర్తిగా తన ఫ్రేమ్ లోకి వచ్చేట్టుగా సెల్ఫీ తీసుకుంది. కోవిడ్ కేసులున్నాయని ఓ వైపు చెబుతూ మరో వైపు మాస్కులు లేకుండా సంబరాలు జరుపుకోవడం హిపోక్రసీ కాక మరేమిటని రిపబ్లికన్స్ పార్టీ కన్సల్టెంట్ ర్యాన్ జేమ్స్ వ్యాఖ్యానించారు. న్యూయార్క్ పోస్ట్ కి ఇచ్చిన చిన్నపాటి ఇంటర్వ్యూలో ఆయన ఈ విమర్శ చేశాడు.

అమెరికాలో ప్రస్తుతం రోజుకు వేల కోద్దీ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని, గత శీతాకాలంతో పోలిస్తే ఇవి చాలా ఎక్కువని జాన్స్ హాఫ్ కిన్స్ యూనివర్సిటీ, బ్లూమ్ బెర్గ్ సంస్థలు తెలిపాయి. శుక్రవారం ఫ్లోరిడాలో లక్షా 35 వేల కేసులు నమోదైనట్టు ఈ సంస్థలు పేర్కొన్నాయి. వ్యాక్సిన్ తీసుకోకపోతే మరింతమంది అమెరికన్లు ఈ వైరస్ కి గురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: కేబినెట్ హోదా మంత్రి సౌకర్యాలు తిరస్కరించిన కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్ప.. ఎందుకంటే ..?

Bigg Boss OTT launch LIVE UPDATES: బాలీవుడ్ లో మొదలైన బిగ్ బాస్ సందడి..బిగ్ బాస్ OTT’ ప్రారంభం