AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tallest Family: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్యామిలీ.. గిన్నిస్ బుక్‌లో చోటు.. నెట్టింట్లో వీడియో వైరల్

Tallest Family: పొడవుగా ఉండటం చాలా అరుదు.. అయితే ప్రపంచ రికార్డు సృష్టించేంత పొడవుగా ఉండటం.. కుటుంబంలో ఒక్కరో, ఇద్దరో ఉండడం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం.. అయితే ఫ్యామిలీ ..

Tallest Family: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్యామిలీ.. గిన్నిస్ బుక్‌లో చోటు.. నెట్టింట్లో వీడియో వైరల్
Us Family
Surya Kala
|

Updated on: Apr 20, 2022 | 10:31 AM

Share

Tallest Family: పొడవుగా ఉండటం చాలా అరుదు.. అయితే ప్రపంచ రికార్డు సృష్టించేంత పొడవుగా ఉండటం.. కుటుంబంలో ఒక్కరో, ఇద్దరో ఉండడం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం.. అయితే ఫ్యామిలీ మొత్తం సభ్యులు మొత్తం ఆరడుగులు దాటితే.. వాళ్ళు నిలబడితే.. ఇంటి టాప్ తగిలేటట్లు ఉంటే .. అలాంటి ఫ్యామిలీ చూస్తే.. ఆశ్చర్యానికి గురికావడం ఖాయం.. అమెరికాకు(America) చెందిన ఓ ఫ్యామిలీ మొత్తం ఆజానుబాహువులే.. ఫ్యామిలీ మొత్తం ఆరడగుల దాటిన పొడవుతో ఉంటారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఫ్యామిలీగా(Tallest family) గిన్నిస్ బుక్ లో(guinnessworldrecords) చోటు సంపాదించుకున్నారు.

USAలోని మిన్నెసోటాలోని ఎస్కోలోని ఒక కుటుంబం.. అతిపొడవైన వ్యక్తులున్న ఫ్యామిలీగా రికార్డు సాధించింది. ఈ విషయాన్నీ ధృవీకరిస్తూ.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేసింది.

మిన్నెసొటా రాష్ట్రం ఎస్కో ప్రాంతంలో నివసించే స్కాట్ ట్రాప్ ఫ్యామిలీలో మొత్తం స్కాట్, క్రిస్సీ, సవన్నా, మోలీ , ఆడమ్ ఐదుగురు సభ్యులు నివసిస్తారు.  “6 డిసెంబర్ 2020న..  ట్రాప్స్ సగటు ఎత్తు 203.29 సెం.మీ (6 అడుగుల 8.03 అంగుళాలు)తో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కుటుంబంగా నిర్ధారించబడింది. కుటుంబం ఉమ్మడి ఎత్తు సగం టెన్నిస్ కోర్ట్ పొడవుకు సమానం!  ట్రాప్ ముగ్గురు పిల్లలు క్రీడాకారులు. బాస్కెట్‌బాల్, వాలీబాల్ పోటీల్లో రాణించారు.

కుటుంబ పెద్ద పేరు స్కాట్ ట్రాప్. పొడవు ఆరడుగుల ఎనిమిది అంగుళాలు. స్కాట్ భార్య క్రిస్సీ పొడవు 6’3″. ఈ స్కాట్  దంపతులకు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. స్కాట్ సంతానంలో పెద్ద కూతురు సవన్నా(27) ఆరు అడుగుల ఎనిమిది అంగుళాలు. చిన్న కూతురు మాలీ(24) 6’6″ పొడవుంటుంది.  స్కాట్ సంతానంలో చిన్నవాడు ఆడమ్(22).. ఫ్యామిలీలో అందరికంటే పొడవు. ఆడమ్ పొడవు ఏకంగా ఏడు అడుగుల మూడు అంగుళాలు. దీంతో.. ఆ కుటుంబం సగటు పొడవు ఆరు అడుగుల ఎనిమిది అంగుళాలకు(6 అడుగుల 8.03 అంగుళాలు) చేరింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కుటుంబంగా గిన్నిస్ బుక్ లో రికార్డ్ లో చోటు సంపాదించుకుంది.

మొదటి నుంచి ఆ ఫ్యామిలీని చూసిన వారెవరైనా ఆశ్చర్యపోయేవారట. ఇదేం హైటు అంటూ నోరెళ్లబెట్టేవారట. ఈ క్రమంలో వీళ్లే గిన్నిస్ రికార్డ్స్ వారిని సంప్రదించి తమ వివరాలను అందించారు. ఇటీవలే వారికి ఈ గుర్తింపు ఇస్తున్నట్టు గిన్నిస్ రికార్డ్స్ వారు తెలిపారు. ఇది తమకు ఎంతో గర్వకారణమంటూ ఆ కుటుంబం తెగ సంబరపడిపోతోంది.

ఈ వీడియో మూడు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడింది. ఇప్పటివరకు ఐదు లక్షలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.  “వారి తల్లిదండ్రులు వస్తువులను షెల్ఫ్‌లో కాకుండా మంచం కింద ఉంచుతారు. వారి పిల్లలకు దూరంగా ఉంచడానికి అంటూ ఫన్నీ కామెంట్ చేయగా.. ఇంత పొడవు గొప్ప గౌరవం.. చాలా ఆహ్లదకరంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:Solar Eclipse of 2022: ఈ నెలలో ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం.. గ్రహణ కాలంలో చేయకూడని పనులు ఏమిటంటే..

Expensive Watermelon: ప్రపంచంలో అరుదైన నల్లని పుచ్చకాయ.. దీని ధర తెలిస్తే మతిపోవాల్సిందే