AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Imran Khan Vs US: చూస్తూనే ఉన్నాం.. సమయం వచ్చినప్పుడు చెబుతాం అంటూ పాక్ కు అగ్రరాజ్యాధినేత హెచ్చరిక

Imran Khan Vs US: రష్యా(Russi) తీరుపై ఓ వైపు ప్రపంచ దేశాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో హిట్లర్ గా కొందరు అభివర్ణిస్తూ.. తమ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది..

Imran Khan Vs US: చూస్తూనే ఉన్నాం.. సమయం వచ్చినప్పుడు చెబుతాం అంటూ పాక్ కు అగ్రరాజ్యాధినేత హెచ్చరిక
Imran Khan Moscow Visit
Surya Kala
|

Updated on: Feb 25, 2022 | 4:08 PM

Share

Imran Khan Vs US: రష్యా(Russi) తీరుపై ఓ వైపు ప్రపంచ దేశాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో హిట్లర్ గా కొందరు అభివర్ణిస్తూ.. తమ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది మరోదారి..  అనే పాత సామెతను గుర్తుకు తెస్తు దాయాది దేశం పాకిస్థాన్(Pakistan)  ప్రధాని ఇమ్రాన్(PM Imran Khan) మాత్రం భిన్నంగా స్పందించారు.  రష్యాకి వంత పాడుతూ యుద్ధ సమయంలో రష్యాకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ .. పాకిస్తాన్ ను పరోక్షంగా ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.. ఎవరైనా రష్యాకు వత్తాసు పలికినా..  అనుకూలంగా వ్యవహరించినా.. సమయం వచ్చినప్పుడు చెబుతాం..అప్పుడు తగిన గుణపాఠం చెబుతాం..  జాగ్రత్త…  నోరు అదుపులో పెట్టుకోండి.. అంటూ యుద్ధ సమయంలో రష్యాలో పర్యటించిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు బైడెన్‌ చేసిన ఘాటు హెచ్చరిక ఇది.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం.. ఆ దేశాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలతో ఒక్కసారిగా అంతర్జాతీయంగా పరిస్థితులు శరవేగంగా మారిపోయాయి. ఉక్రెయిన్ ను ఆక్రమించేందుకు త్రిశూల వ్యూహంతో అన్ని విధాల ప్రయత్నిస్తోంది. బాంబులు, మిస్సైల్‌తో విరుచుకుపడుతోంది. ఇప్పటికే రాజధానిని దాదాపు ఆక్రమించేసుకుంది. ఓ వైపు ఆదేశ ప్రజలు భయబ్రాంతులతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని క్షణం క్షణం భయం భయంగా బతుకుతున్నారు. అయితే ఇటువంటి సమయంలో కొన్ని దేశాలు బాధ్యతగా వ్యవహరిస్తూ.. ఇరుదేశాలు శాంతి కోసం కృషి చేయాలనీ కూర్చుని మాట్లాడుకోవాలని కోరుతున్నాయి. అయితే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం అగ్గికి ఆజ్యం పోసినట్లు ఇప్పుడు రష్యా పర్యటనకు వెళ్లారు.  ఇరుదేశాల మధ్య  యుద్ధం కొనసాగుతున్న సమయంలో పాకిస్థాన్‌ వేస్తున్న అడుగులను ప్రపంచ దేశాలు సునిశితంగా గమనిస్తున్నాయి.

పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈనెల 23న రష్యా టూర్‌కి వెళ్లారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా కు వెళ్లిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజధాని మాస్కోలో అడుగు పెట్టారు. అక్కడ ఆయనకు రష్యా విదేశాంగ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఓవైపు రష్యా  ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తుండంతో.. రష్యా తీరుని ఖండిస్తూ.. ఆదేశంపై ఆర్ధికంగా ఆంక్షలు విధిస్తూ చర్యలు తీసుకుంటున్న వేళ.. ఇప్పుడు పాక్ ప్రధాని.. రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు తహతహలాడుతున్నారు. రష్యాలో పర్యటించడం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరపడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  పాక్ రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇంధన రంగంలో సహకారాన్ని పెంచే విషయంపై పుతిన్‌, ఇమ్రాన్‌ చర్చించుకున్నట్లుగా సమాచారం.  అయితే ఇప్పుడు ఇమ్రాన్‌ఖాన్‌ మాస్కో వెళ్లడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

ఓ వైపు అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ బాధ్యతలను చేపట్టిన అనంతరం పాక్ ప్రధాని తో ఫోన్ లో కూడా మాట్లాడిన సందర్భం లేదు.. ఇక ఆప్ఘానిస్తాన్‌ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత అగ్రరాజ్యానికి చెందిన మిలటరీ బేస్‌లను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు పాకిస్థాన్ నిరాకరించింది. దీంతో పాక్ అమెరికా దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రమే ఉండడంతో.. పాక్ ఈ సమయంలో రష్యాతో సంబంధం మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకనే  దాదాపు 23 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌ ప్రధాని రష్యాలో అడుగు పెట్టాడు.

అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు రష్యాను దూరం పెడుతుంటే పాక్‌ మాత్రం రష్యాకు దగ్గర కావాలని కోరుకుంటుంది.  దీంతో పాకిస్థాన్‌ వ్యవహారశైలిపై అగ్రరాజ్యం అమెరికా మండిపడుతోంది. యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో పాక్‌ ప్రధాని రష్యా టూర్‌కి వెళ్లడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. రష్యా తీరును ప్రతి దేశం నిరసించాలని అమెరికా కోరుతుంది. లేకపోతే భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇస్తోంది.

Also Read:

 ఈ టికెట్ ధరలకు మేము సినిమాను ప్రదర్శించలేమంటూ థియేటర్స్ క్లోజ్… ఎక్కడంటే..