Ukraine Russia War: కైవ్‌లో మారణహోమం సృష్టించిన రష్యా సైన్యం.. శిథిలాల కింద 410 మృతదేహాల గుర్తించామన్న ఉక్రెయిన్

ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగిన 40 రోజుల తర్వాత కైవ్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది ఉక్రెయిన్. రష్యన్ దళాలు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకోలేకపోయాయి.

Ukraine Russia War: కైవ్‌లో మారణహోమం సృష్టించిన రష్యా సైన్యం.. శిథిలాల కింద 410 మృతదేహాల గుర్తించామన్న ఉక్రెయిన్
Ukraine War
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 04, 2022 | 8:03 AM

Ukraine Russia War: ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగిన 40 రోజుల తర్వాత కైవ్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది ఉక్రెయిన్. రష్యన్ దళాలు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌(Kyiv)ను స్వాధీనం చేసుకోలేకపోయాయి. కానీ నగరం నుండి బయలుదేరే ముందు విధ్వంసం సృష్టించాయి. కైవ్ ప్రాంతం నుండి 410 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ పేర్కొన్నారు. బుచాలో సామూహిక సమాధులను చూసిన తర్వాత రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) పిలుపునిచ్చారు. అదే సమయంలో, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు.

ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కు సమీపంలోని బుచా నగరంలో చనిపోయిన పౌరుల దృశ్యాలను చూసిన తర్వాత తాను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురయ్యానని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. ఈ మారణ హోమంపై స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రష్యా సైన్యం కైవ్ నుండి ఉపసంహరించుకున్న తర్వాత విస్తృత కైవ్ ప్రాంతాల నుండి 410 మంది పౌరుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ చెప్పారు. అదే సమయంలో, బుచాలో రష్యన్ దళాలు పౌర ప్రాణనష్టాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది.

దేశాన్ని ఉద్దేశించి జెలెన్‌స్కీ మాట్లాడుతూ, ఉక్రెయిన్ తూర్పు దక్షిణాన మరింత ఒత్తిడిని పెంచడానికి రష్యాకు భద్రతా దళాలు ఉన్నాయన్నారు. రష్యన్ దళాల లక్ష్యం ఏమిటి? వారు డాన్‌బాస్‌ను ఉక్రెయిన్‌లోని దక్షిణాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని, మీ స్వేచ్ఛను, మీ భూమిని, మీ ప్రజలను రక్షించుకోండి అంటూ పిలుపునిచ్చారు.రష్యన్ దళాలు గణనీయమైన సంఖ్యలో మారియుపోల్ చుట్టూ ఉన్నాయి, ఇక్కడ రక్షకులు అవిశ్రాంతంగా పోరాడుతున్నారన్నారు. రష్యా సైన్యం వెనక్కు తగ్గిందంటే పెద్ద ముప్పు పొంచి ఉందని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జెలెన్‌స్కీ దేశ ప్రజలకు సూచించారు. శత్రువు దేశాన్ని ఎదుర్కొనేందుకు యాంటీ మిస్సైల్ సిస్టమ్స్ మరియు ఎయిర్‌క్రాఫ్ట్ వంటి మరింత అధునాతన ఆయుధాలు అందించాలని మరోసారి పాశ్చాత్య దేశాలకు జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు.

Read Also….  Nurses Dance: ఆసుపత్రిలో డాన్సులు చేసిన నర్సులు.. లేచి కూర్చున్న కోమాలోని పేషెంట్..!