Ukraine – Russia War: ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో కీలక పరిణామం.. సంచలన ప్రకటన చేసిన పుతిన్..!

Ukraine - Russia War: ఉక్రెయిన్‌లోని పోర్ట్‌సిటీ, పోల్‌ని పూర్తిగా స్వాధీనం చేసుకునట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు.

Ukraine - Russia War: ఉక్రెయిన్ - రష్యా యుద్ధంలో కీలక పరిణామం.. సంచలన ప్రకటన చేసిన పుతిన్..!
Vladimir Putin
Follow us
Shiva Prajapati

| Edited By: Subhash Goud

Updated on: Apr 23, 2022 | 6:41 PM

Ukraine – Russia War: ఉక్రెయిన్‌లోని పోర్ట్‌సిటీ, పోల్‌ని పూర్తిగా స్వాధీనం చేసుకునట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. రష్యా బలగాలకు ఆయన అభినందనలు తెలిపారు. మరియుపోల్‌లోని అజోవ్‌స్తల్‌ స్టీల్‌ప్లాంట్‌లో ఇంకా 2 వేల మంది ఉక్రెయిన్‌ సైనికులు నక్కి ఉన్నట్టు గుర్తించామని, కాని బంకర్ల నుంచి ఈగ కూడా పారిపోకుండా చూడాలని పుతిన్‌ రష్యా సైన్యాన్ని పుతిన్‌ ఆదేశించారు. ఉక్రెయిన్‌ సైనికులు లొంగిపోతే, వారికి ఎటువంటి హాని తలపెట్టమని హామీఇచ్చారు.

మరియుపోల్‌ను విముక్తం చేశామని రష్యా అధ్యక్షుడే చెప్పుకుంటుంటే, అంత సీన్‌ లేదని ఉక్రెయిన్‌ ఖండించింది. మరియుపోల్‌లోని అజోవ్‌స్థల్‌ స్టీల్‌ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్నామన్న రష్యా వాదనను ఉక్రెయిన్‌ తోసిపుచ్చింది. స్టీల్‌ప్లాంట్‌లో ఇంకా సాయుధులు ఉన్నారనీ, రష్యా దాన్ని స్వాధీనం చేసుకోలేకపోయిందని ఉక్రెయిన్‌ ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు.

ఉక్రెయిన్‌పై ప్రణాళికబద్ధంగా దాడులు చేస్తున్నామని- రష్యా అధ్యక్షభవనమైన క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ చెప్పారు. అయితే మరియుపోల్‌లోని అజోవ్‌స్థల్‌లోని స్టీల్‌ప్లాంట్‌లోకి దాడి చేయకూడదని అధ్యక్షుడు పుతిన్‌ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్‌ సైనికులకు ఇప్పటికైనా లొంగిపోయే అవకాశం ఉందని పెస్కోవ్‌ చెప్పారు. మరోవైపు మరియుపోల్‌లో తాము ఎలాంటి విధ్వంసం చేశామో వివరిస్తూ రష్యా ఒక వీడియో విడుదల చేసింది.

ఉక్రెయిన్‌ మీద తన తడాఖా చూపిస్తోంది రష్యా సైన్యం. 9K58 అనే మల్టిపుల్‌ రాకెట్‌ లాంచింగ్‌ సిస్టమ్‌ నిప్పులు చెరిగింది. మెరుపువేగంతో క్షిపణులు దూసుకుపోయాయి. ఉక్రెయిన్‌ తూర్పుభాగంలో ఫిక్స్‌ చేసిన టార్గెట్లను ధ్వంసం చేశాయి. 57వ రోజున ఉక్రెయిన్‌ను, దానికి మద్దతిచ్చే నాటోను రష్యా మల్టిపుల్‌ రాకెట్‌ లాంచింగ్‌ సిస్టమ్‌ను ప్రయోగించింది.

ఉక్రెయిన్‌లోని బొరొడియాంక నగరాన్ని డెన్మార్క్‌ ప్రధానమంత్రి మేట్‌ ఫ్రెడెరిక్సన్‌, స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్‌ సందర్శించారు. రష్యా దాడుల్లో ధ్వంసమైన భవనాలను, ప్రజలు పడిన ఇబ్బందులను తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ప్రధానులు ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీని కలుసుకున్నారు. ఉక్రెయిన్‌కు తమ మద్దతును ప్రకటించారు.

రష్యా సైన్యం ఆనవాళ్లు కనిపించిన చోటల్లా- ఉక్రెయిన్‌ సైన్యం దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌ ఆగ్నేయ ప్రాంతంలోని జపరోజ్యే ప్రాంతంలోని టోక్‌మాక్‌ నగరంపై ఉక్రెయిన్‌ బాంబుదాడులు చేసింది. ప్రశాంతమైన ఈ ప్రాంతం శిథిలంగా మారినట్లు- రష్యా సైన్యం చెబుతోంది. ఉక్రెయిన్‌ యుద్ధం సుదీర్ఘంగా సాగుతున్నవేళ, రష్యా వైఫల్యం అంటూ విమర్శలు వస్తున్నవేళ, పుతిన్‌ సైన్యం- ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ప్రపంచంలోని ఏ లక్ష్యాన్నయినా ధ్వంసం చేస్తుందని రష్యా చెబుతోంది. ఈ ICBM పేరు సర్మాత్‌. అయితే అణ్వస్త్రాల మీద చర్చ సాగుతున్నవేళ, సర్మాత్ ప్రయోగం ముప్పు కాదని అమెరికా రక్షణరంగ ప్రధాన కార్యాలయం- పెంటగాన్‌ తెలిపింది.

Also read:

Kalyana Laxmi Scheme: కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులతో ఎమ్మెల్యే బిగాల ఆత్మీయ సమ్మేళనం.. తన స్వంత ఖర్చులతో..

Andhra Pradesh Politics: 2024 ఎన్నికలే టార్గెట్‌గా రంగంలోకి చంద్రబాబు.. సీనియర్లకు వార్నింగ్స్..!

Pre Wedding Diet: ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌ తెలుసు .. కానీ కొత్తగా ఇదేంటబ్బా?..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో