AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రిటన్ లో థర్డ్ కోవిద్ వేవ్ రావచ్చు…, ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు రవి గుప్తా అంచనా

బ్రిటన్ లో విధించిన లాక్ డౌన్ ఆంక్షలను జూన్ 21 నుంచి పూర్తిగా ఎత్తివేసిన పక్షంలో థర్డ్ కోవిద్ వేవ్ ప్రారంభం కావచ్చునని అక్కడి ఓ నిపుణుడు తెలిపాడు. ఓ కోవిద్ వేరియంట్ కారణంగా ఈ ముప్పు ఉందని...

బ్రిటన్ లో థర్డ్ కోవిద్ వేవ్ రావచ్చు..., ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు రవి గుప్తా అంచనా
Uk May Face Third Covid Wave Says An Expert
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: May 31, 2021 | 7:50 PM

Share

బ్రిటన్ లో విధించిన లాక్ డౌన్ ఆంక్షలను జూన్ 21 నుంచి పూర్తిగా ఎత్తివేసిన పక్షంలో థర్డ్ కోవిద్ వేవ్ ప్రారంభం కావచ్చునని అక్కడి ఓ నిపుణుడు తెలిపాడు. ఓ కోవిద్ వేరియంట్ కారణంగా ఈ ముప్పు ఉందని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారైన ప్రొఫెసర్ రవిగుప్తా చెప్పారు. జూన్ 21 నుంచి అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తోందని, కానీ ఈ ప్రతిపాదనను జాప్యం చేయాలనీ, అంటే వాయిదా వేయాలని ఆయన సూచించారు. దేశంలో గత 5 రోజులుగా రోజూ 3 వేల కోవిద్ కేసులు నమోదవుతున్నాయని అన్నారు. ఈ కోవిద్ వేరియంటే ఇందుకు కారణమని భావిస్తున్నామని, ప్రస్తుతానికి కోవిద్ కేసులు తక్కువే ఉన్నప్పటికీ రానున్న వారాల్లో ఇవి పెరిగినా పెరగవచ్చునని ఆయన చెప్పారు. ఇది థర్డ్ వేవ్ ప్రారంభానికి సూచికగా భావిస్తున్నామని అన్నారు. దేశ జనాభాలో చాలామందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను చేబట్టిన దృష్ట్యా ఈ వేవ్ ఆలస్యంగా నైనా తలెత్తవచ్చు అని రవిగుప్తా పేర్కొన్నారు. అన్-లాక్ ప్రక్రియను మొదలు పెట్టేలోగా ప్రభుత్వం ఇంటెలిజెన్స్ సమాచారాన్ని తెప్పించుకోవాలని, నిపుణుల సూచనలనుపాటించాలని ఆయన అన్నారు. పర్యావరణ శాఖ మంత్రి జార్జి యాస్తిస్ , ఇతర కొందరు ప్రొఫెసర్లు కూడా రవి గుప్తాతో ఏకీభవించారు.

ఇప్పుడిప్పుడే బ్రిటన్ లో చాలామంది మాస్కులు ధరించకపోగా బార్లు, రెస్టారెంట్లలో గుంపులు గుంపులుగా కస్టమర్లు కనిపిస్తున్నారు. ప్రభుత్వ ఆంక్షలను పట్టించుకోకుండా..తమను అడగడానికి వచ్చిన పోలీసులపైనే తిరగబడుతున్నారు. మరి దీనిపై రవి గుప్తా వంటివారు నోరు మెదపడం లేదు.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : యూపీలో అనాముషం..డెడ్ బాడీ నదిలో పడేస్తూ వీడియోకు పోజులు ఇచ్చిన యువకులు: vial video.

Leopard catch Hyena Viral Vieo:హైనా ఆహారం కొట్టేసిన చిరుత..అంతలోనే షాకింగ్‌ సీన్‌!వైరల్ అవుతున్న వీడియో.

owl Viral video : నెటిజన్లను ఆకట్టుకుంటున్న గుడ్లగూబ..అందమైన గుడ్లగూబ..ఎన్ని వంకర్లు పోతుందో..!

Viral Video : పెళ్లిరోజు వధువును చూసి షాకైన వరుడు..!కాబోయే వాడిని భ‌లే బురిడీ కొట్టించిన యువ‌తి.. ఆక‌ట్టుకుంటోన్న ప్రాంక్ వీడియో..