కరోనాతో మృతి చెందిన భారతీయ సంతతి డాక్టర్.. నివాళులు అర్పించనున్న లండన్ ఆసుపత్రి
కరోనాతో మృతి చెందిన భారతీయ సంతతి డాక్టర్‌కి ఈస్ట్రన్ లండన్‌లోని ఓ ఆసుపత్రి ఘన నివాళులు అర్పించనుంది. గురువారం వైద్యుడు మృతి చెందగా

Indian-origin doctor: కరోనాతో మృతి చెందిన భారతీయ సంతతి డాక్టర్‌కి ఈస్ట్రన్ లండన్‌లోని ఓ ఆసుపత్రి ఘన నివాళులు అర్పించనుంది. గురువారం వైద్యుడు మృతి చెందగా.. కరోనా సమయంలో ఆయన చేసిన అపార సేవలను గుర్తు చేసుకుంటూ అక్కడి కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11 గంటలను ఓ సంతాప సభను ఏర్పాటు చేయబోతోంది. ఆ రోజు ఒక నిమిషం పాటు ఆసుపత్రి యాజమాన్యం మౌనం పాటించనున్నారు. (ఇంట్రస్టింగ్‌గా ‘మహా సముద్రం’ థీమ్ పోస్టర్.. నేను అలల కంటే మొండివాడిని అంటోన్న శర్వా)
వివరాల్లోకి వెళ్తే.. భారతీయ సంతతికి చెందిన డాక్టర్ కృష్ణన్ సుబ్రమణ్యన్(46) రాయల్ డెర్బీ ఆసుపత్రుల్లో(యూహెచ్‌డీబీ) మత్తుమందు కన్సల్టెంట్‌గా పనిచేసేవారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా.. లైసెస్టర్‌లోని గ్లెన్‌ఫీల్డ్ ఆసుపత్రి చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంతాపం ప్రకటించబోతున్నట్లు యూహెచ్‌డీబీ ట్రస్ట్ సీఈవో గేవిన్ బోలే తెలిపారు. (రూమర్లకు మరోసారి చెక్ పెట్టిన సుమ.. నువ్వే నా బలం, సంతోషమంటూ)
యూహెచ్‌డీబీ ఫ్యామిలీకి ఇది బాధకరమైన విషయం. కరోనా సమయంలో రోగులకు కృష్ణన్ అపార సేవలు అందించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ.. వృత్తిపట్ల కృష్ణన్ అంకితభావాన్ని గుర్తుచేసుకుంటూ సంతాపం ప్రకటించాలనుకుంటున్నాం. కృష్ణన్ మరణం ఆ ట్రస్ట్‌లోని అందరికీ బాధను కలిగించింది. అతడు చాలా మంచి వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. కాగా కరోనా వేళ భారతదేశానికి చెందిన ఎంతోమంది డాక్టర్లు, నర్సులు.. వివిధ దేశాల్లో సేవలు అందిస్తోన్న విషయం తెలిసిందే. (మీరే దేశానికి వెలకట్టలేని ఆస్తి.. చిన్నారులకు సీఎం జగన్ బాలల దినోత్సవం శుభాకాంక్షలు)