జపాన్‌లో రెచ్చిపోయిన సైకో.. చిన్నారులే టార్గెట్‌గా దాడి
జపాన్‌లోని కవాసకి నగరంలో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. కత్తితో అనేక మందిపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు చనిపోగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో చాలా మంది చిన్నారులే ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటన జపాన్ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.00 గంటలకు చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్లేందుకు బస్ […]

జపాన్‌లోని కవాసకి నగరంలో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. కత్తితో అనేక మందిపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు చనిపోగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో చాలా మంది చిన్నారులే ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అయితే ఈ ఘటన జపాన్ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.00 గంటలకు చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్లేందుకు బస్ స్టాప్‌కు వచ్చిన విద్యార్థులే లక్ష్యంగా దుండగుడు దాడికి దిగాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దాడికి పాల్పడ్డ అనంతరం నిందితుడు కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.